https://www.eenadu.net/eenadu_api/metadata.php?newsid=122147012&type=latestnewslatestnews
stdClass Object
(
    [response] => Array
        (
            [0] => stdClass Object
                (
                    [news_id] => 122147012
                    [news_title_telugu] => SBI సేవలపై విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేయండిలా..
                    [news_title_english] => launch any complaint against sbi
                    [news_short_description] => స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులో ఉంది. 

                    [news_tags_keywords] => 
                    [news_meta_keywords] => 
                    [news_createdon] => 2022-08-01 12:14:04
                    [news_thumbimage] => 
                    [news_pdfisactive] => 0
                    [news_title_prefix] => 
                )

        )

)
SBI సేవలపై విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేయండిలా.. | launch any complaint against sbi

SBI సేవలపై విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేయండిలా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులో ఉంది. 

Published : 01 Aug 2022 13:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులా? బ్యాంక్ సేవ‌ల‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? శాఖలో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేదా? అయితే, మీరు బ్యాంకుకు ఈ విష‌యాల గురించి ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకులో ఖాతా తెరిచే వారు కూడా ఖాతా తెరిచే స‌మ‌యంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటి గురించీ ఫిర్యాదుల‌ను రిజిస్ట‌ర్ చేయ‌వ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులో ఉంది.

ఎలా ఫిర్యాదు చేయాలి?

  • ఎస్‌బీఐ వెబ్‌సైట్ హోమ్ పేజ్‌లో అందుబాటులో ఉన్న కస్టమర్ కంప్లయింట్‌ ఫారంపై క్లిక్ చేయ‌డం ద్వారా ఫిర్యాదులు చేసే పేజీ ఓపెన్ అవుతుంది. లేదా (https://crcf.sbi.co.in/ccf/) వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు పేజీకి వెళ్లొచ్చు.
  • ఇక్క‌డ రెండు బాక్సులు కనిపిస్తాయి. మొద‌టి బ్యాక్సులో కంప్లయింట్‌/రిక్వస్ట్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఇక రెండో బాక్సులో కొన్ని కేట‌గిరీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీ కేట‌గిరీని ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు వ్య‌క్తిగ‌త సెగ్మెంట్‌లో ఫిర్యాదు చేయాల‌నుకుంటే ఆ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఒక‌వేళ మీరు డిజిట‌ల్ పేమెంట్స్ గురించి ఫిర్యాదు చేయాల‌నుకుంటే సంబంధిత ఆప్ష‌న్ ఎంచుకుని స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి.
  • ఇక్క‌డ మీరు మీ ఖాతా నంబ‌రు, క్యాప్చాను ఎంట‌ర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. 
  • ఇప్పుడు మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌రుకు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేస్తే మ‌రొక పేజీ ఓపెన్ అవుతుంది.
  • స్క్రీన్‌పై క‌నిపిస్తున్న‌ ఫారంలో మీరు ఏ బ్యాంకు బ్రాంచ్ గురించి ఫిర్యాదు చేయాల‌నుకుంటున్నారో ఆ బ్యాంకు కోడ్‌ని ఎంట‌ర్ చేయాలి.
  • ఆ త‌ర్వాత మీరు బ్యాంక్ ఉద్యోగులు లేదా సేవ‌ల గురించి ఏ ఏవిష‌యంపై ఫిర్యాదు చేయాల‌నుకుంటున్నారో ఎంచుకుని, దాని గురించి స్వ‌ల్ప వివ‌ర‌ణ ఇచ్చి స‌బ్మిట్ చేస్తే మీ ఫిర్యాదు ఎస్‌బీఐ ఉన్న‌తాధికారుల‌కు చేరుతుంది.
  • జనరల్ బ్యాంకింగ్‌, బ్యాంక్ సంబంధిత కేట‌గిరీలో ఫిర్యాదుల‌ను టోల్ -ఫ్రీ నంబ‌ర్లు 1800 1234, 1800 2100, 1800 11 2211, 1800 425 3800, 080-26599990 వ‌ద్ద కూడా రిజిస్ట‌ర్ చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని