Lava Blaze X: ₹14 వేలకే కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో లావా కొత్త ఫోన్‌.. బ్లేజ్‌ ఎక్స్‌ వివరాలు ఇవీ..!

దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా బ్లేజ్‌ సిరీస్‌లో ‘లావా బ్లేజ్‌ ఎక్స్‌’ను స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో లభించే ఈ ఫోన్‌ ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేయండి. 

Published : 10 Jul 2024 17:48 IST

LAVA blaze X | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. బ్లేజ్‌ సిరీస్‌లో లావా బ్లేజ్‌ ఎక్స్‌ (Lava Blaze X)ను తీసుకొచ్చింది. కర్వ్‌డ్‌ డిస్‌ప్లే,  64 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో అందుబాటు ధరలో ఈ 5జీ ఫోన్‌ను తీసుకురావడం విశేషం.

ఈ ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గా నిర్ణయించింది. బ్యాంక్‌ ఆఫర్‌తో రూ.13,999కే కొనుగోలు చేయొచ్చు. 6జీబీ+128 జీబీ రూ.15,999, 8జీబీ+128 జీబీ రూ.16,999గా కంపెనీ పేర్కొంది. అన్ని వేరియంట్లపై ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1000 డిస్కౌంట్‌ను లావా అందిస్తోంది. లావా ఇ- స్టోర్‌, అమెజాన్‌ స్టోర్‌లో జులై 20 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ ప్రకటించింది. స్టార్‌లైట్‌ పర్పుల్‌, టైటానియం గ్రే కలర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది.

మోటో నుంచి మిడ్‌ రేంజ్ 5జీ ఫోన్‌.. జీ85 వివరాలు ఇవీ..

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. పంచ్‌ హోల్‌ డిజైన్‌తో 6.67 అంగుళాల కర్వ్‌డ్‌ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేటు కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ఇచ్చారు. బ్యాక్‌ కెమెరా 64MP+2MP సోనీ సెన్సార్‌తో పాటు ముందు భాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాను అమర్చారు. దీనిలో డబుల్‌ వ్యూ వీడియో, ఫిల్మ్‌, ప్రో వీడియో వంటి వివిధ షూటింగ్ మోడ్‌లను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని