Education Loans: ఉన్న‌త విద్యా రుణాల‌కు ప్ర‌ముఖ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?

ఉన్న‌త విద్య కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారికి విద్యారుణం పొంద‌డం ఇప్పుడు చాలా సుల‌భం. 

Updated : 02 May 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు విద్యార్థులు ఉన్న‌త విద్య‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. త‌మ ఉన్న‌త విద్య‌కు దేశంలో వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌లోని కోర్సుల‌కు, విదేశాల‌లోని విద్య‌ను అభ్య‌సించ‌డానికి ముంద‌డుగు వేస్తున్నారు. అయితే, ఈ విద్య‌కు స‌రిప‌డా నిధులను త‌ల్లిదండ్రులు స‌మ‌కూర్చ‌లేక‌పోవ‌చ్చు. అప్పుడు వారికి  విద్యా రుణమే శ‌ర‌ణ్యం.

ఉన్న‌త విద్య కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారికి విద్యారుణం పొంద‌డం ఇప్పుడు చాలా సుల‌భం. నిబంధ‌న‌లు, ష‌ర‌తులు కూడా అనువుగానే ఉంటున్నాయి. మీ అవ‌స‌రాల‌ను బట్టి అనేక విద్యా రుణాలు.. మీ కోర్సు ఫీజులు, మీ ప్ర‌యాణ‌, వ‌స‌తి ఖ‌ర్చుల‌ కోసం మీకు స‌హాయ‌ప‌డ‌తాయి. మీరు విద్యా రుణం కోసం ప్ర‌య‌త్నించే ముందు మీ అర్హ‌త‌ను ముందుగానే చూసుకోవ‌డం మంచిది. మీ రుణ అర్హ‌త‌ను ఆన్‌లైన్‌లో త‌నిఖీ చేయ‌వ‌చ్చు. బ్యాంకులు కూడా త‌మ నిధులు అర్హులైన విద్యార్థులకు మాత్ర‌మే చేరేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నాయి.

విదేశాల‌కు వెళ్లే విద్యార్థులు వారి అర్హ‌త‌ను బట్టి రూ.1 కోటి వ‌ర‌కు విద్యా రుణం పొందొచ్చు. తిరిగి చెల్లింపు వ్య‌వ‌ధి 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. ఇది బ్యాంకును బ‌ట్టి మారొచ్చు. మీరు రుణ చెల్లింపు వ‌డ్డీపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80ఈ కింద ప‌న్ను మిన‌హాయింపు పొందుతారు. 

రూ.15 ల‌క్ష‌ల విద్యా రుణం, 7 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి ఈఎంఐలు దిగువ ప‌ట్టిక‌లో ఉన్నాయి.

గ‌మ‌నిక: ఈ డేటా 2022 ఏప్రిల్‌ 27 నాటిది. బ్యాంకు నియ‌మ‌ నిబంధ‌న‌లు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ‌డ్డీ రేట్ల‌లో మార్పులుండొచ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు EMIలో కలపలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని