Lexus LX 500d: భారత విపణిలోకి లెక్సస్‌ లగ్జరీ ఎస్‌యూవీ

లెక్సస్ అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర ₹ 2.82 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. 

Published : 23 Dec 2022 23:22 IST

ముంబయి: జపాన్‌కు చెందిన టయోటా విలాస కార్ల విభాగమైన లెక్సస్‌, కొత్త ఎస్‌యూవీ లెక్సస్‌ ఎల్‌ 500డీ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కార్ల శ్రేణిలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌. భారత మార్కెట్లో ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర ₹ 2.82 కోట్లు. 10 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌తో 3.3 లీటర్ల ట్విన్‌ టర్బోఛార్జ్‌డ్‌ వీ6 డీజిల్‌ ఇంజిన్‌, 304 బీహెచ్‌పీ శక్తిని, 700 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  ఈ కారు ముందుభాగంలో రెండు టచ్‌ స్క్రీన్‌లు ఉన్నాయి. 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌ స్క్రీన్‌ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ కింది భాగంలో అమర్చిన 7 అంగుళాల డిస్‌ప్లేతో ప్యాసింజర్లు కారు లోపలి ఉష్ణోగ్రతలు సర్దుబాటు చేసుకోవడంతోపాటు, ఇంటీరియర్‌ లైటింగ్‌ వంటి వాటిని కంట్రోల్ చేయొచ్చు. 

లెక్సస్‌ ఎల్‌ 500డీలో ఏడు రకాల డ్రైవ్‌ మోడ్స్‌ ఉన్నాయి. వినియోగదారులు తాము ప్రయాణించే ప్రదేశానికి తగినట్లుగా వాటిని సర్దుబాటు చేసుకుని సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇస్తున్నారు. వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా, పనోరమ సన్‌రూఫ్, ఫింగర్‌ ప్రింట్ అథెంటికేషన్‌ వంటి పీచర్లు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని