Updated : 27 May 2022 16:02 IST

LG India: భారత మార్కెట్‌లోకి ఎల్‌జీ రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీవీ.. ధరెంతో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ ఇండియా(LG india) తాజాగా మడతబెట్టగలిగే ఓఎల్‌ఈడీ టీవీ(Rollable television)ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్‌జీ సిగ్నేచర్‌ ఆర్‌ ఓఎల్ఈడీ (LG Signature R OLED)గా దీనికి నామకరణం చేసింది. దీంతో పాటు, 97 అంగుళాల టెలివిజన్‌ సహా విస్తృత శ్రేణిలో సరికొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. వీటిల్లో సిగ్నేచర్‌ ఆర్‌ ఓఎల్‌ఈడీ(Signature R OLED) అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్‌ మాత్రమే వినాలనుకున్నప్పుడు ఈ ఓఎల్‌ఈడీ తెరను చుట్టేసి సౌండ్‌ సిస్టమ్‌గా మార్చుకోవచ్చు. భారత్‌ దేశంలో మొదటిసారి ఈ తరహా టెక్నాలజీని తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థగా ఎల్‌జీ రికార్డు సృష్టించింది. మరింత ఇంత విశిష్టత కలిగిన ఈ టీవీ ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.75లక్షలు.

సిగ్నేచర్‌ ఆర్‌ ఓఎల్‌ఈడీ మోడల్‌తో పాటు, మరికొన్ని ఓఎల్‌ఈడీ మోడల్స్‌ను కూడా ఎల్‌జీ భారత విపణిలోకి తీసుకొచ్చింది. 45 అంగుళాల తెర నుంచి 97 అంగుళాల తెర వరకూ వివిధ టెలివిజన్లు ఈ శ్రేణిలో ఉన్నాయి. అన్ని గదులకు సరిపోయేలా విధంగా వివిధ సైజుల్లో వీటిని విడుదల చేసింది. అంతేకాదు, గేమర్స్‌కు ప్రత్యేక అనుభూతిని ఇచ్చేలా కొన్ని మోడల్స్‌ను తీర్చిదిద్దింది. న్యూ అల్ఫా 9 జనరేషన్‌5 ప్రాసెసర్‌తో ఈ టీవీలను రూపొందించారు. ఇందులోని దృశ్యాలు నిజ జీవిత అనుభూతిని ఇస్తాయని ఎల్‌జీ ఇండియా తెలిపింది.

భారత విపణిలోకి విడుదల చేసిన సరికొత్త ఎల్‌జీ ఓఎల్‌ఈడీ (LG OLED TV)టీవీలను జీ2, జెడ్‌2, సీ2 సిరీస్‌లుగా ఎల్‌జీ విభజించింది. జీ2, సీ2 సిరీస్‌లలో 4కె ఓఎల్‌ఈడీ తెరలు, జెడ్‌2 సిరీస్‌ ద్వారా ప్రపంచలోనే అతిపెద్ద 8కె ఓఎల్‌ఈడీ తెర కలిగిన టీవీలను తీసుకొచ్చింది. 88 అంగుళాల తెర కలిగిన టీవీలు జెడ్‌2 సిరీస్‌లో ఉంటాయి. అన్ని టీవీలకు డాల్బీ విజన్‌ ఐక్యూ, డాల్బీ అట్మాస్‌ టెక్నాలజీలను అనుసంధానించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్ట్రీమింగ్‌ సర్వీస్‌లైన నెట్‌ఫ్లిక్స్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌ సహా అన్ని ఇందులో ఉంటాయి. తాజా టెలివిజన్‌లలో వెబ్‌ ఓఎస్‌22ను ఉపయోగించారు. దీని ద్వారా రూమ్‌ టు రూమ్‌ షేరింగ్‌ చేసుకోవచ్చు. ఈ సరికొత్త రేంజ్‌ టెలివిజన్‌లు రూ.89,900 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ ఇవి అందుబాటులో ఉంటాయని ఎల్‌జీ ఇండియా తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని