LIC policy renewal: పాలసీ పునరుద్ధరణకు LIC మరో అవకాశం
LIC policy renewal: పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన జీవిత బీమా పాలసీలను ఆలస్య రుసుములో రాయితీని పొంది పునరుద్ధరించుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తమ పాలసీదారులకు శుభవార్త తెలిపింది. పాలసీదారులు తమ లాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఈ అవకాశం కల్పించడం ఇది రెండోసారి. దీనిలో భాగంగా పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన జీవిత బీమా పాలసీలను ఆలస్య రుసుములో రాయితీని పొంది పునరుద్ధరించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెల్లించిన మొత్తం ప్రీమియం ఆధారంగా టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లు కాకుండా మిగిలిన వాటికి మాత్రమే ఆలస్య రుసుములో రాయితీని అందిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.
ఒకవేళ మీరు ల్యాప్స్ అయిన పాలసీకి రూ.లక్ష వరకు ప్రీమియం చెల్లించినట్లైతే ఆలస్య రుసుములో 20 శాతం వరకు రాయితీని ఎల్ఐసీ ఇస్తోంది. అయితే, రాయితీ గరిష్ఠ పరిమితి రూ.2000 మాత్రమే. అదే విధంగా, ఒకవేళ మీరు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ప్రీమియం చెల్లించినట్లైతే ఆలస్య రుసుములో 25 శాతం వరకు రాయితీని పొందొచ్చు. దీని గరిష్ఠ పరిమితి రూ.2500. అలాగే ఒకవేళ మీరు రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించినట్లైతే, ఆలస్య రుసుములో 30 శాతం వరకు రాయితీ పొందొచ్చు. దీని గరిష్ఠ పరిమితిని రూ. 3000గా ఎల్ఐసీ నిర్ణయించింది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల పునరుద్ధరణకు ఆలస్య రుసుములో 100 శాతం రాయితీని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ అవకాశం మార్చి 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్