Updated : 02 May 2022 16:39 IST

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ..యాంకర్‌ ఇన్వెస్టర్ల అనూహ్య స్పందన!

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఐపీఓ (LIC IPO)లోని యాంకర్‌ ఇన్వెస్టర్ల భాగానికి భారీ స్పందన లభించినట్లు సమాచారం. ఈ విభాగానికి కేటాయించిన రూ.5,630 కోట్లు విలువ చేసే షేర్లకు భారీ డిమాండ్‌ లభించినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈరోజు సాయంత్రానికి ఎల్‌ఐసీ (LIC) దీనిపై అధికారిక ప్రకటన చేయొచ్చని సమాచారం.

ఐపీఓ (IPO) ధరల శ్రేణిని ఎల్‌ఐసీ రూ.902-949గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఏ ధర వద్ద షేర్లను కేటాయించారో ఇంకా తెలియాల్సి ఉంది. సాధారణంగా షేర్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయితే, గరిష్ఠ ధర వద్ద షేర్లను కేటాయిస్తారు. అలాగే ఏ యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్లు విజయవంతమయ్యాయో కూడా తెలియాల్సి ఉంది. గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ, నొమురా, సింగపూర్‌ జీఐసీ పీటీఈ, నార్వే సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగంలో బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. (Also Read: ఎల్‌ఐసీ షేర్లు కొనాలా వద్దా? బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?)

మే 4న ప్రారంభం కానున్న పబ్లిక్‌ బిడ్డింగ్‌లోనూ ఇదే తరహాలో భారీ స్పందన లభించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ లక్ష్యమైన రూ.20,557 కోట్ల సమీకరణ సునాయసంగా జరిగిపోతుంది.

ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO)  గురించి మరిన్ని విషయాలు..

ఐపీఓ ప్రారంభం: మే 4

ఐపీఓ ముగింపు: మే 9

ధరల శ్రేణి : రూ.902-రూ.949

తగ్గింపు: రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు: రూ.45, పాలసీదారులకు రూ.60

దరఖాస్తు: కనీసం 15 షేర్లకు. ఒక లాట్‌ (15 షేర్లు) నుంచి గరిష్ఠంగా 14 లాట్‌ల (210 షేర్లు) కోసం దరఖాస్తు చేయొచ్చు. (Also Read: ఎల్‌ఐసీ ఐపీఓకి ఇలా దరఖాస్తు చేసుకోండి!)

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని