LIC IPO: ఐపీఓల్లో ‘బిగ్‌బీ’ ఎల్‌ఐసీనే.. టాప్‌ 10 జాబితా ఇదే..

ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC IPO) త్వరలోనే ఐపీఓకు రానుంది. మొత్తం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ...

Updated : 28 Apr 2022 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC IPO) త్వరలోనే ఐపీఓకు రానుంది. మొత్తం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది. భారత ఈక్విటీ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. తొలుత ఎల్‌ఐసీలో అయిదు శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించి రూ.63 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మార్కెట్‌లో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో దీన్ని రూ.21 వేల కోట్లకు తగ్గించారు. అయినప్పటికీ ఎల్‌ఐసీనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఈ జాబితాలో పేటీఎం, కోల్‌ ఇండియా తర్వాతి స్థానాల్లో నిలవనున్నాయి.

  • ఇప్పటి వరకు భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం సమీకరించిన రూ.18,300 కోట్లే అత్యధికం. 2021 నవంబరులో ఈ సంస్థ షేర్లు విక్రయించారు.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్‌ ఇండియా రెండో స్థానంలో ఉంది. 2010 నవంబరులో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయ్యింది. ఈ ఐపీఓ ద్వారా రూ.15,200 కోట్లు సమీకరించారు.
  • ఈ జాబితాలో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌  పవర్‌ది మూడో స్థానం. 2008లో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా రూ.11,700 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు.
  • జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(జీఐసీ) నాలుగో స్థానంలో ఉంది. 2017లో నిర్వహించిన ఐపీఓ ద్వారా రూ.11,372 కోట్లు సమీకరించారు.
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ 2020లో ఐపీఓకు వచ్చింది. మొత్తం రూ.10,354 కోట్లు సమీకరించి ఐదో స్థానంలో నిలిచింది.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ ఆరో స్థానంలో ఉంది. 2004లో వచ్చిన ఈ ఐపీఓ విలువ రూ.10 వేల కోట్లు.
  • న్యూ ఇండియా అస్యూరెన్స్‌ (రూ.9,600 కోట్లు), జొమాటో (రూ.9,375 కోట్లు), డీఎల్‌ఎఫ్‌ (రూ.9,187 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (రూ.8,695 కోట్లు) టాప్‌-10 స్థానాల్లో నిలిచాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని