LIC on whatsapp: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవలు.. ఎలా పొందాలి?

జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (liC) పాలసీదారులకు మరింత సులభంగా సేవలను అందించనుంది. దీనికోసం వాట్సాప్‌లో (Whatsapp) కొత్త నంబరును ప్రారంభించింది.

Updated : 05 Dec 2022 16:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) పాలసీదారులకు మరింత సులభంగా సేవలను అందించనుంది. దీనికోసం వాట్సాప్‌లో కొత్త నంబరును ప్రారంభించింది. ‘పాలసీదారులు 8976862090 నంబరుకు ‘హాయ్‌’ (Hi) అని సందేశం పంపిస్తే చాలు. మొత్తం 10 రకాల సేవలను అందుబాటులోకి వస్తాయ’ని ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ తెలిపారు.

వాట్సాప్‌ ద్వారా ప్రీమియం బకాయి, బోనస్‌ సమాచారం, పాలసీ స్థితి, పాలసీపై రుణం ఎంత వస్తుంది?, రుణం తిరిగి చెల్లింపు, రుణంపై వడ్డీ, ప్రీమియం చెల్లింపు సర్టిఫికెట్‌, యులిప్‌- యూనిట్ల స్టేట్‌మెంట్‌, ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింకులు, ఆప్ట్‌ ఇన్‌/ఆప్ట్‌ ఔట్‌ సేవలను పొందేందుకు వీలుందని పేర్కొన్నారు. ముందుగా పాలసీ వివరాలను ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొన్న వారు, తమ అధీకృత మొబైల్‌ నంబరు నుంచి ఈ సేవలను పొందవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని