LIC Shares: ఎల్‌ఐసీ షేర్లు మళ్లీ ఢమాల్‌.. 25 శాతం పతనమైన విలువ

‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (LIC)’ ఐపీఓకు వచ్చిన తొలి రోజు నుంచే ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వరుసగా తొమ్మిదో రోజు ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం

Published : 10 Jun 2022 14:10 IST

ముంబయి: ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (LIC)’ ఐపీఓకు వచ్చిన తొలి రోజు నుంచే ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వరుసగా తొమ్మిదో రోజు ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు విలువ ఒకదశలో 1.62శాతం పతనమై రూ.709.20 వద్ద ట్రేడ్‌ అయ్యంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయిన తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా భారీగా పడిపోతోంది.

మే 17వ తేదీన ఎల్‌ఐసీ లిస్టింగ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఈ షేర్లు 8శాతం నష్టంతో లిస్టయ్యాయి. ఆ తర్వాత కూడా తీవ్ర ఒడుదొడుకుల మధ్య షేర్లు చలిస్తున్నాయి. ఇప్పటివరకు ఇష్యూ ధరతో పోలిస్తే 25.22 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇష్యూ ధరతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6.02లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ విలువ రూ.4.5లక్షల కోట్లకు పడిపోయింది.

ఎల్ఐసీ యాంకర్‌ ఇన్వెస్టర్ల 30 రోజుల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించే వీలు లభిస్తుంది. దీంతో లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగిస్తే.. షేరు విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని రిటైల్ ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దీంతో ముందస్తుగానే అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఎల్‌ఐసీ షేర్లు భారీగా పతనమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని