LIC IPO: ఎల్‌ఐసీ వద్ద ఎవరూ క్లెయిం చేయని రూ.21,539 కోట్ల నిధులు

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వద్ద ఎవరూ క్లెయిం చేయని రూ.21,539 కోట్ల నిధులు ఉన్నాయి....

Published : 16 Feb 2022 17:45 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వద్ద ఎవరూ క్లెయిం చేయని రూ.21,539 కోట్ల నిధులు ఉన్నాయి. ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న ఎల్‌ఐసీ.. సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో ఈ విషయం వెల్లడించింది. వడ్డీతో కలిపి తమ వద్ద ఇన్ని నిధులు పోగయ్యాయని పేర్కొంది. మార్చి 2021 నాటికి అన్‌క్లెయిమ్డ్‌ నిధులు రూ.18,495 కోట్లు, మార్చి 2020 నాటికి రూ.16,052.65 కోట్లు ఉన్నట్లు తెలిపింది.

రూ.1000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్‌ చేయని నిధులు ఏదైనా బీమా సంస్థ వద్ద పోగైతే.. వాటి వివరాలు ఆయా సంస్థలు తమ వెబ్‌సైట్లలో పొందుపరచాల్సి ఉంటుంది. పదేళ్లు దాటినా ఆ వివరాలను అలాగే ఉంచాలి. వీటికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకునేందుకు పాలసీదారులు లేదా లబ్ధిదారులకు వీలు కూడా కల్పించాలి. అలాగే సీనియర్‌ సిటిజెన్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ (SCWF) చట్టం ప్రకారం.. పదేళ్లు దాటిన క్లెయిం చేయని నిధులను ఎస్‌సీడబ్ల్యూఎఫ్‌కు బదిలీ చేయాలి. ఈ నిధుల గణన, బదిలీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖలోని బడ్జెట్‌ డివిజన్ నిర్దేశించిన విధివిధానాలను పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని