LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ తేదీ ఖరారు.. వచ్చేది ఆరోజే!

మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది.......

Updated : 25 Apr 2022 22:36 IST

దిల్లీ: మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. మే 4వ తేదీన ప్రారంభమై మే 9న ముగిసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈనె ల 27న కచ్చితమైన తేదీలు ఖరారు కానున్నాయి. ఐపీఓలో భాగంగా 5 శాతం వాటాలను విక్రయించాలని తొలుత భావించినప్పటికీ.. మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 3.5 శాతానికి తగ్గించేందుకు ఎల్‌ఐసీ బోర్డు నిర్ణయించింది. వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.21,000 కోట్ల వరకు సమీకరించనున్నారు.

ఎల్‌ఐసీ ఐపీఓను గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినా, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేసింది. పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీ ఇచ్చిన అనుమతులు మే 12 వరకు వర్తిస్తాయి. ఆ గడువు దాటితే మళ్లీ కొత్తగా సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 4న ఐపీఓకి వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని