Pensioners: లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించారా? రేపే చివరితేదీ

ప్రతీ సంవత్సరం నవంబరు 30 లోపు జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది

Published : 29 Nov 2022 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు.. నిరంతరాయంగా పెన్షన్‌ పొందేందుకు ప్రతి సంవత్సరం నవంబరు 30 లోపు జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి సమర్పించకపోతే పెన్షన్‌ను నిలిపి వేయవచ్చు. ఈ సంవత్సరం ఇంకా జీవన ప్రమాణ పత్రం సమర్పించకపోతే.. రేపటితో (నవంబర్‌ 30) గడువు ముగియనందున వెంటనే ఆ పని పూర్తిచేయాలి. జీవన్ ప్రమాణ పోర్టల్‌ ద్వారా గానీ, మీరు పెన్షన్‌ పొందుతున్న బ్యాంకు బ్రాంచికి వెళ్లిగానీ, బ్యాంకులు అందించే సేవల ద్వారా ఆన్‌లైన్‌లో గానీ.. ఇలా వివిధ మార్గాల ద్వారా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేయండి.

పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే విధానాలు

ఒకవేళ మీరు ఎంప్లాయిస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) అందిస్తున్న ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌ 95) కింద పెన్షన్‌ పొందుతున్న ప్రైవేటు రంగ ఉద్యోగులైతే నవంబరు నెలలోనే జీవణ ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని లేదు. సంవత్సరంలో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సమర్పించవచ్చు. ఈపీఎఫ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి సమర్పించిన లైఫ్‌ సర్టిఫికెట్‌ 12 నెలలు పనిచేస్తుంది. కాబట్టి, చివరిసారిగా సమర్పించిన తేదీ నుంచి 12 నెలలలోపు సమర్పిస్తే సరిపోతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు