Life Insurance: సింగిల్ ప్రీమియంతో కెన‌రా హెచ్ఎస్‌బీసీ సరికొత్త పాలసీ

ఈ పాల‌సీలో సింగిల్ లైఫ్‌, జాయింట్ లైఫ్ క‌వ‌రేజ్ అనే 2 ర‌క్ష‌ణ అవ‌కాశాల‌ను అందిస్తుంది.

Published : 12 Jul 2022 12:29 IST

`కెన‌రా హెచ్ఎస్‌బీసీ` లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారెంటీడ్ వ‌న్ పే అడ్వాంటేజ్ ప్లాన్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. స్టాక్ మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో సంబంధం లేకుండా బీమా చేసిన వారి కుటుంబానికి ర‌క్ష‌ణ‌, హామి మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాల‌ను ఈ ప్లాన్ అందిస్తుంది.

50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు ఎవ‌రైనా 5, 7 లేదా 10 సంవ‌త్స‌రాల కాలానికి క‌నీసం ఒకేసారి రూ. 5 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్రీమియం చెల్లించి ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీపై నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది. ఈ హామితో కూడిన, ఒకేసారి చెల్లించే, నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్ ప్లాన్ అనేది వ్య‌క్తిగ‌త జీవిత బీమా ప్ర‌ణాలిక. 

ఈ పాల‌సీలో సింగిల్ లైఫ్‌, జాయింట్ లైఫ్ క‌వ‌రేజ్ అనే 2 ర‌క్ష‌ణ అవ‌కాశాల‌ను అందిస్తుంది. సింగిల్ లైఫ్ విష‌యంలో, పాల‌సీదారు మ‌ర‌ణిస్తే మ‌ర‌ణంపై హామి మొత్తం నామినికీ చెల్లిస్తారు. పాల‌సీ కూడా ర‌ద్దు చేస్తారు. జాయింట్ లైఫ్ విష‌యంలో పాల‌సీదారుల‌లో ఒకరు మరణిస్తే..ప్రీమియంలో 1.25 రెట్లు రెండవ వ్య‌క్తికి చెల్లించ‌బ‌డుతుంది. పాల‌సీ కూడా కొన‌సాగుతుంది. జీవించి ఉన్న రెండవ పాల‌సీదారుడు కూడా చ‌నిపోతే, నామినీల‌కు హామి మొత్తం చెల్లిస్తారు.

ఏదైనా అత్యవసరం క‌లిగిన‌ప్పుడు ఈ పాల‌సీ స‌రెండ‌ర్ విలువ‌లో 80% వ‌ర‌కు రుణం పొందొచ్చు. క‌నీస రుణం రూ. 20 వేల వ‌ర‌కు ఇస్తారు. ఈ రుణానికి వార్షిక వ‌డ్డీ (2022-23 ఆర్ధిక సంవ‌త్స‌రంలో) 7.30% వ‌సూలు చేస్తారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 31న పాల‌సీ రుణ వ‌డ్డీ రేటును స‌మీక్షించే హ‌క్కు కంపెనీకి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని