Ukraine crsisis: రష్యాలో వ్యాపారాలు బంద్.. పెరుగుతున్న కంపెనీల జాబితా!
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి వ్యతిరేకంగా అనేక బడా కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి....
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి వ్యతిరేకంగా అనేక బడా కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాల్ని మూసివేయగా.. తాజాగా ఈ జాబితాలో కోకా-కోలా, స్టార్‌బక్స్, పెప్సీ, మెక్ డొనాల్డ్స్ వంటి ఆహార సంస్థలు సైతం చేరాయి. అలాగే జనరల్ ఎలక్ట్రిక్ సైతం అదే బాటలో పయనించింది.
‘ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసను తమ కంపెనీ సిద్ధాంతాలు అంగీకరించలేవు’ అని మెక్ డొనాల్డ్స్ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్ కెంప్జిన్స్కీ తెలిపారు. రష్యాలో ఉన్న 850 స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, వాటిలో పనిచేస్తున్న 62 వేల మంది ఉద్యోగులకు మాత్రం వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మెక్‌డొనాల్డ్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న పరిస్థితులు సవాల్‌గా మారాయని వ్యాఖ్యానించారు.
మరోవైపు కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్టార్‌బక్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో ఉన్న తమ 130 స్టోర్ల ద్వారా వచ్చిన లాభాల్ని ఉక్రెయిన్‌కు విరాళంగా ఇచ్చేస్తామని ప్రకటించింది. అలాగే రష్యాలో ఉన్న తమ 2,000 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని తెలిపింది. మరోవైపు పెప్సికో, జనరల్ ఎలక్ట్రిక్ రష్యాలో తమ కార్యకలాపాల్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇప్పటి వరకు దాదాపు 120కి పైగా కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో కొన్ని కీలక కంపెనీలివీ..
ఫేస్బుక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాపిల్, గూగుల్, మాస్టర్ కార్డ్, వీసా, కేపీఎంజీ, నెట్‌ఫ్లిక్స్, స్పోటిఫై, జాన్ లెవిస్, నోకియా, ఐకియా, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, హెచ్అండ్ఎం, శాంసంగ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, నైకీ, పేపాల్, స్పోర్ట్స్ డైరెక్ట్, బోయింగ్, సిస్కో సిస్టమ్స్, డెల్ టెక్నాలజీస్, డెలాయిట్, ఫెడెక్స్, జనరల్ మోటార్స్, గోడాడీ, హోండా మోటార్, ఇంటెల్ కార్పొరేషన్, మెర్సిడెస్ బెంజ్ తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం