
PPF: పీపీఎఫ్‌పై ఎప్పుడు, ఎంతవరకు రుణం లభిస్తుంది?
దీర్ఘకాల లక్ష్యాల కోసం పొదుపు చేసే వారికి PPF ఒక మంచి ఆప్షన్. మీ పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి లభిస్తుంది. ఇందులో వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఖాతాలో 15 సంవత్సరాల లాక్ - ఇన్ పిరియడ్ ఉంటుంది. అయితే, అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే రుణం తీసుకునే సదుపాయం ఉంది. ఇందుకు కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల పీపీఎఫ్ ఖాతాపై రుణం ఎప్పుడు, ఎంత వరకు తీసుకోవచ్చనేది ముందుగానే తెలుసుకోవాలి.
ఎప్పుడు లభిస్తుంది?
పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించిన మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణం తీసుకోవచ్చు. మొదటి రెండు సంవత్సరాలు రుణ సదుపాయం ఉండదు. అలాగే 7వ సంవత్సరం నుంచి కూడా రుణ సదుపాయం ఉండదు. అయితే, 7వ సంవత్సరం నుంచి కొన్ని నిబంధనలను అనుసరించి పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు.
ఉదాహరణకి..రోహిత్ 2020 జనవరిలో పీపీఎఫ్ ఖాతా తెరిచారనుకుందాం..
ఆర్థిక సంవత్సరం 1: ఏప్రిల్ 2019 - మార్చి 2020 (జనవరి 2020లో ఖాతా తెరిచారు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరాన్ని మొదటి సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటారు)
ఆర్థిక సంవత్సరం 2: ఏప్రిల్ 2020 - మార్చి 2021
ఆర్థిక సంవత్సరం 3: ఏప్రిల్ 2021 - మార్చి 2022 (ఇది 3వ ఆర్థిక సంవత్సరం కాబట్టి రుణం తీసుకొనేందుకు అర్హత ఉంటుంది)
ఆర్థిక సంవత్సరం 4: ఏప్రిల్ 2022 - మార్చి 2023
ఆర్థిక సంవత్సరం 5: ఏప్రిల్ 2023 - మార్చి 2024
ఆర్థిక సంవత్సరం 6: ఏప్రిల్ 2024 - మార్చి 2025 (ఈ ఏడాది వరకు మాత్రమే రుణం తీసుకునేందుకు అర్హత ఉంటుంది)
ఆర్థిక సంవత్సరం 7: ఏప్రిల్ 2025 - మార్చి 2026 (రోహిత్ ఇక్కడ 7వ ఏడాదిలో ఉంటాడు కాబట్టి అతని పీపీఎఫ్ ఖాతా నుంచి నిబంధనలకు లోబడి పాక్షికంగా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు)
ఎంత వరకు తీసుకోవచ్చు..
పీపీఎఫ్ ఖాతా ఆరంభించిన రెండో ఏడాది చివరి నాటికి.. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 25 శాతం రుణంగా లభిస్తుంది. లేదా ఎప్పుడు రుణం కోసం దాఖలు చేస్తున్నారో ఆ ఏడాదికి ముందు ఏడాది ఖాతాలో ఉన్న మొత్తంపై 25 శాతం రుణంగా లభిస్తుంది.
ఉదాహరణకు మీరు మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.1.5 లక్షలు (గరిష్ఠ పరిమితి) డిపాజిట్ చేస్తే మీ ఖాతాలో వడ్డీతో కలిపి రెండో ఏడాది చివరినాటికి దాదాపు రూ. 3.35 లక్షలు ఉంటాయి. పీపీఎఫ్ వడ్డీ ప్రతి నెల లెక్కించి ఏడాది చివర్లో ఖాతాలో క్రెడిట్ చేస్తారు. వడ్డీ రేటు 7.10 శాతంతో ఇక్కడ లెక్కించడం జరిగింది.
ఇప్పుడు మూడో ఏడాదిలో రుణం కోసం దరఖాస్తు చేస్తే రూ. 3.35 లక్షల్లో 25 శాతం అంటే సుమారుగా రూ.83 వేల వరకు మీకు రుణం లభిస్తంది. అదే నాలుగు, ఐదు లేదా ఆరో ఏడాదిలో ఖాతాలో జమ అయిన మొత్తం పెరుగుతుంది కాబట్టి మరింత ఎక్కువ రుణం లభించే అవకాశం ఉంటుంది. అయితే, తీసుకున్న రుణం తిరిగి 36 నెలల్లోపు చెల్లించాల్సి ఉంఉటుంది. ఒకేసారి మొత్తం లేదా వాయిదాల్లో చెల్లించవచ్చు.
వడ్డీ రేటు..
రుణ వడ్డీని మీ పీపీఎఫ్ ఖాతా అందించే వడ్డీ నుంచి తీసుకుంటారు. మిగిలిన 1% వడ్డీని మీ ఖాతాలో మొత్తం నుంచి తీసి వేస్తారు. పీపీఎఫ్‌పై ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ వస్తుంది. ఇప్పుడు రుణం తీసుకుంటే 1 శాతం అదనంగా, అంటే 8.10 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది గృహ రుణంతో పోలిస్తే కాస్త ఎక్కువ అయినప్పటికీ, వ్యక్తిగత రుణాల కంటే తక్కువనే చెప్పాలి. తీసుకున్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా 36 నెలల్లో చెల్లిస్తే 1 శాతం మాత్రమే అదనపు వడ్డీ వర్తిస్తుంది. లేదంటే వార్షికంగా 2-6 శాతం అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
దరఖాస్తు..
పీపీఎఫ్ ఖాతాపై రుణం కోసం దరఖాస్తు చేసే వారు ఫారం ‘డి’ ని నింపాల్సి ఉంటుంది. ఖాతా నెంబరు, కావాల్సిన రుణ మొత్తం, ఇతర వివరాలను నింపి ఖాతాదారుడు సంతకం చేయాలి. ఈ ఫారంతో పాటు పీపీఎఫ్ పాస్‌బుక్‌ని సంబంధిత బ్యాంక్/పోస్టాఫీసు అధికారులకు అందిస్తే మీ రుణ దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు రుణం మంజూరు చేస్తారు. ఒక ఏడాదిలో ఒకసారి మాత్రమే రుణం ఇస్తారు. ఒకసారి రుణం పొందినవారు, మరోసారి రుణం తీసుకోవాలంటే ముందుగా తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించాలి.
పీపీఎఫ్‌పై రుణం తీసుకోవడం సరైన నిర్ణయమేనా?
పీపీఎఫ్ దీర్ఘకాలిక పెట్టుబడి, ఇందులో చాలా మంది వారి పదవీ విరమణ కోసం డిపాజిట్ చేస్తారు. అందువల్ల, స్వల్పకాలిక నగదు అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను కదపకపోతేనే మంచిది. ఎందుకంటే దీర్ఘకాలిక చక్ర వడ్డీ ప్రభావాన్ని కోల్పోతారు. పీపీఎఫ్ ద్రవ్యోల్బణాన్ని అధిగమించిన పన్ను రహిత, రిస్క్ లేని రాబడినిస్తుంది. అందువల్ల ఆర్థిక అవసరాలకు ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలి. అంతేకాకుండా, దీనిపై లభించే రుణ మొత్తం కూడా తక్కువగానే ఉంది. మీ అవసరాలకు ఇది సరిపోకపోవచ్చు. అయితే, ప్రత్యామ్నాయం లేనప్పుడు, డబ్బు అత్యవసరం అయినప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
-
Movies News
Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్