Bank Lockers: బ్యాంకులో లాక‌ర్ తీసుకుంటున్నారా? ఛార్జీలు ఇలా ఉంటాయి..

లాక‌ర్ల‌పై ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ విధిస్తున్న ఛార్జీల వివ‌రాలు.

Updated : 20 Jan 2022 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు, ఇత‌ర ముఖ్య‌మైన ప‌త్రాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు చాలా మంది బ్యాంకు లాక‌ర్ తీసుకుంటారు. బ్యాంకులో వేరు వేరు సైజుల్లో లాక‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఈ స‌ర్వీసును అందించినందుకుగానూ బ్యాంకులు కొంత రుసుము విధిస్తాయి. ఇది బ్యాంకు ఉన్న ప్ర‌దేశం (రూర‌ల్‌, అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, మెట్రో), మీరు ఎంచుకున్న‌ లాక‌ర్ సైజుపై ఆధారప‌డి ఉంటుంది.

లాక‌ర్ల‌పై ప్రముఖ బ్యాంకులు విధిస్తున్న వార్షిక ఛార్జీలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

1. చిన్న సైజ్ లాక‌ర్ అద్దె..

* అర్బ‌న్‌, మెట్రో న‌గరాల‌లో రూ.2000+ జీఎస్‌టీ

* రూర‌ల్‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల‌లో రూ.1500+జీఎస్‌టీ

2. మీడియ‌ం సైజ్ లాక‌ర్ అద్దె..

* అర్బ‌న్‌, మెట్రో న‌గరాల‌లో రూ.4000+ జీఎస్‌టీ

* రూర‌ల్‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల‌లో రూ.3000+జీఎస్‌టీ

3. లార్జ్‌ సైజ్ లాక‌ర్ అద్దె..

* అర్బ‌న్‌, మెట్రో న‌గరాల‌లో రూ.8000+ జీఎస్‌టీ

* రూర‌ల్‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల‌లో రూ.6000+జీఎస్‌టీ

4. ఎక్స్‌ట్రాలార్జ్‌ సైజ్ లాక‌ర్ అద్దె...

* అర్బ‌న్‌, మెట్రో న‌గరాల‌లో రూ.12000+ జీఎస్‌టీ

* రూర‌ల్‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల‌లో రూ.9000+జీఎస్‌టీ

అంతేకాకుండా లాక‌ర్ రిజిస్ట్రేష‌న్ కోసం ఎస్‌బీఐ స్మాల్‌, మీడియ‌ం సైజ్ లాక‌ర్ల‌కు రూ.500+జీఎస్‌టీ; లార్జ్‌, ఎక్స్‌ట్రా సైజ్ లాక‌ర్ల‌కు రూ.1000+జీఎస్‌టీ ఛార్జ్ చేస్తుంది. ఇది వన్‌-టైమ్ ఫీజు మాత్ర‌మే.

ఐసీఐసీఐ బ్యాంక్...
సేఫ్ డిపాజిట్ లాక‌ర్ కోసం ద‌ర‌ఖాస్తు చేసేందుకు ద‌ర‌ఖాస్తు ఫారం, నోట‌రీ చేసిన లాక‌ర్ అగ్రిమెంట్‌, రెండు ఫొటోలు అవ‌స‌రం. ఐసీఐసీఐ బ్యాంక్ లాక‌ర్‌ వార్షిక అద్దెను ముందుగానే చెల్లించాలి. అద్దెను చెల్లించేందుకు లాక‌ర్ తీసుకునే వ్య‌క్తికి ఐసీఐసీఐ బ్యాంకులో యాక్టివ ఖాతా ఉండాలి. ఐసీఐసీఐ బ్యాంక్ చిన్న సైజ్ లాక‌ర్ల‌కు రూ.1,200 నుంచి రూ.5,000, మిడియ‌మ్ సైజ్ లాక‌ర్ల‌కు రూ.2,500 నుంచి రూ.9,000, లార్జ్ సైజ్ లాక‌ర్ల‌కు రూ.4,000 నుంచి రూ. 15,000, ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లాక‌ర్ల‌కు రూ. 10,000 నుంచి రూ. 22,000 వ‌ర‌కు అద్దె వ‌సూలు చేస్తుంది. ఈ చార్జీల‌కు జీఎస్‌టీ అద‌నం.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌.. 

పీఎన్‌బీ బ్యాంక్ ఇటీవ‌లె లాక‌ర్ ఛార్జీల‌ను పెంచ‌డంతో పాటు, ఒక సంవ‌త్స‌రంలో ఇచ్చే ఉచిత విజిట్స్‌ని 15 నుంచి 12కి త‌గ్గించింది. లాక‌ర్ వార్షిక అద్దె రూర‌ల్‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల‌లో రూ.1250 నుంచి రూ.10,000 వ‌ర‌కు ఉంటే, అర్బ‌న్‌, మెట్రో న‌గ‌రాల‌లో రూ.2000 నుంచి రూ.10,000 వ‌ర‌కు ఉంటుంది. పెరిగిన లాక‌ర్ ఛార్జీలు జ‌న‌వ‌రి 15 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి.

యాక్సిస్ బ్యాంక్‌...

యాక్సిస్ బ్యాంక్‌లో లాక‌ర్ ఉన్న వారు నెల‌కు మూడు సార్లు ఉచితంగా లాక‌ర్ విజిట్ చేయ‌వ‌చ్చు. ఆ త‌రువాత చేసే ప్ర‌తి విజిట్‌కి రూ.100+జీఎస్‌టీ వ‌సూలు చేస్తారు. ఒక‌సారి చెల్లించిన వార్షిక అద్దెను లాక‌ర్ స‌రెండ‌ర్ చేసినా తిరిగి ఇవ్వ‌రు. అద్దె ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీ విధిస్తారు.

* రూర‌ల్ ప్రాంతాల‌లో చిన్న‌సైజు లాక‌ర్‌కి రూ.1,400, మీడియ‌ం సైజుకి రూ.2,200, లార్జ్ సైజుకి రూ.5,000, ఎక్స్‌ట్రా లార్జ్ సైజుకి రూ. 10,000. 

* సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో చిన్న‌సైజు లాక‌ర్కి రూ.1,600, మీడియ‌ం సైజుకి రూ.2,500, లార్జ్ సైజుకి రూ.5,500, ఎక్స్‌ట్రా లార్జ్ సైజుకి రూ.11,000. 

* అర్బ‌న్, మెట్రో ప్రాంతాల్లో చిన్న‌సైజు లాక‌ర్ కి రూ. 2,700, మీడియ‌ం సైజుకి రూ.6,000, లార్జ్ సైజుకి రూ.10,800, ఎక్స్‌ట్రా లార్జ్ సైజుకి రూ.12,960 అద్దె వ‌ర్తిస్తుంది. వీటన్నింటికీ జీఎస్‌టీ అద‌నం.

చివ‌రగా..

బ్యాంకుల్లో లాక‌ర్ సైజుని బ‌ట్టి అద్దె ఉంటుంది. కొన్ని బ్యాంకులకు వార్షిక అద్దె ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అద్దె చెల్లింపుల్లో ఆల‌స్యం జ‌రిగితే జరిమానా ఉంటుంది. అందువ‌ల్ల లాక‌ర్ అద్దెకు స‌రిపోయే మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో ఉంచాలి. లాక‌ర్ తెరిచేందుకు బ్యాంకులు ఉచిత విజిట్స్ ఇస్తాయి. ఇవి ముగిస్తే ప్ర‌తీ విజిట్‌కి ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. అందువ‌ల్ల ప్లాన్ చేసుకుని లాక‌ర్ తెర‌వాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచీ వద్ద లాకర్ తెరవడం మేలు.

(గ‌మ‌నిక‌.. బ్యాంకులు లాక‌ర్ల‌పై విధిస్తున్న ఛార్జీల‌ను అవ‌గాహ‌న కోసం ఇక్క‌డ ఇవ్వ‌డం జ‌రిగింది. ఒకే ప్రాంతంలో ఉన్న‌ప్ప‌టికీ రెండు వేరు వేరు బ్యాంకుల్లో ఛార్జీలు వేరు వేరుగా ఉండ‌చ్చు. ఈ ఛార్జీల‌కు జీఎస్‌టీ అద‌నంగా ఉంటుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని