ఆర్థిక లక్ష్యాల‌ను సాధించ‌డానికి కొన్ని మార్గాలు...

వ్య‌క్తి జీవితంలో క‌చ్చితంగా మూడు నుంచి నాలుగు ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. మ‌రి వాటిని ఎలా నెరవేర్చుకోవాలి. ఎందులో పెట్టుడులు పెడితే రిస్ లేకుండా ఎక్కువ రాబ‌డిని పొందువ‌చ్చు అన్న‌దానిపై అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి....

Published : 17 Dec 2020 16:41 IST

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు కొన్ని ముఖ్య‌మైన పెట్టుబ‌డి మార్గాలు ఉన్నాయి​​​​​​​

వ్య‌క్తి జీవితంలో క‌చ్చితంగా మూడు నుంచి నాలుగు ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. మ‌రి వాటిని ఎలా నెరవేర్చుకోవాలి. ఎందులో పెట్టుడులు పెడితే రిస్ లేకుండా ఎక్కువ రాబ‌డిని పొందువ‌చ్చు అన్న‌దానిపై అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి. ముందుగా 25-35 సంవ‌త్స‌రాల‌లోపు ఆ ల‌క్ష్యాల‌పై స్ప‌ష్ట‌త క‌లిఇ ఉండాలి. సాధార‌ణంగా అంద‌రికి…

  1. సంపాదించే స‌మ‌యంలో డ‌బ్బును భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.
  2. కింత‌ డ‌బ్బును పిల్ల‌లు, వారి పిల్ల‌ల కోసం దాచి ఉంచాలి.
  3. పిల్ల‌ల చ‌దువు, పెళ్లి వాటి ఆర్థ‌క ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి.
  4. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత భార్యకు లేదా భ‌ర్త‌కు మంచి జీవితాన్ని అందించాలి. ఇలాంటి ఆర్థిక ల‌క్ష్యాలు ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో స‌ర్వ‌సాధార‌ణం.

అయితే ఈ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు జాగ్ర‌త్తగా ప్ర‌ణాళికా వేసుకోవాల్సి ఉంటుంది. ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా సంపాద‌న కూడా ఉండాలి. వ్య‌క్తులు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు రిస్క్ లేకుండా ముఖ్య‌మైన పెట్టుబ‌డి మార్గాలు ఏంటి అంటే క‌నీసం నాలుగు ఆప్ష‌న్స్ ఉంటాయి. అందులో ఏవి మీకు స‌రిపోతాయో వాటిని ఎంచుకోవాలి.

1.ప‌న్ను ర‌హిత బాండ్లు

గ‌తంలో ప్ర‌భుత్వ రంగ మౌలిక కంపెనీలు నేష‌నల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రూర‌ల్ ఎల‌క్ర్టిఫికేష‌న్ కార్పోరేష‌న్‌, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పోరేష‌న్ వంటి సంస్థ‌లు బాండ్ల‌ను జారీ చేయ‌డం ద్వారా నిధుల‌ను స‌మీక‌రించేవి. ఈ బాండ్ల‌పై వ‌డ్డీ ఉండేది కాదు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప‌న్ను ర‌హిత బాండ్ల జారీ నిలిపివేశారు. ప్ర‌స్తుతం సెకండ‌రీ మార్కెట్ల‌లో ఈ బాండ్ల‌పై 6 నుంచి 6.50 శాతం రాబ‌డి ఉంటుంది. ఈ బాండ్ల కాల‌ప‌రిమితి 17 సంవ‌త్స‌రాలు. ఈ బాండ్ల ద్వారా ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం క‌ష్ట‌మే.

  1. ప‌ది సంవ‌త్స‌రాల‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లు

ప‌దేళ్ల‌కు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 6 నుంచి 6.5 శాతం వ‌ర‌కు రాబ‌డి వ‌స్తే , ఆర్‌బీఐ బాండ్ల మీద 7.75 శాతం వ‌ర‌కు ఉంటుంది. వీటి కాల‌ప‌రిమితి 7 సంవ‌త్స‌రాలు. రెండింటికి వ‌డ్డీపై ప‌న్నుప‌డుతుంది.

  1. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)

ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను ఆదా, క‌చ్చిత‌మైన లాభంతో పాటు, డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది. కాల‌ప‌రిమితి15 సంవ‌త్స‌రాలు, ప్ర‌స్తుతం దీనిపై 7.6 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత కూడా ఐదేళ్ల చొప్పున దీనిని పొడ‌గించుకోవ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక‌రు రూ.1.5 లక్ష‌ల వ‌ర‌కే పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంటుంది. అయితే ఆరు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేఉకునే అవ‌కాశం ఉంది.

  1. దీర్ఘ‌కాలిక మ్యూచువల్ ఫండ్లు

మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ‌ సెబీ ఇటీవలే ఫిక్స్‌డ్ ఆదాయాన్నిచ్చే దీర్ఘ‌కాలిక పథకాలన్నింటిని ఏక‌తాటిపైకి తెచ్చింది. ఈ ఫండ్లు ఏడు సంవ‌త్స‌రాల‌కంటే ఎక్కువ కాల పరిమితి గల పథకాల్లో పెట్టుబడి పెట్టి ఉండాలి. దీర్ఘకాలిక ఆస్తులలో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి.

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు క‌లిగిన‌వారు, దీర్ఘ‌కాలీకంగా క‌చ్చిత‌మైన ఆదాయం వ‌చ్చే ఆస్తుల‌లో పెట్టుబ‌డులు చేయ‌డం మేలు. ఉదాహ‌ర‌ణ‌కు 28 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి క‌లిగిన ప్ర‌భుత్వ సెక్యూరిటీలో పెట్టుబ‌డి ప్రారంభిస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కొక‌సారి ప్ర‌భుత్వం దీనికి వ‌డ్డీ వ‌ర్తింప‌జేస్తుంది. మొత్తం మెచ్యూరిటీ ముగిసేవ‌ర‌కు పెట్టుబ‌డి మొత్తం మీద వ‌డ్డీ రేట్లు కొన‌సాగిస్తుంది. దీంతో వ‌డ్డీ రేట్లు పెరిగినా, త‌గ్గినా పెట్టుబ‌డిదారుడికి న‌ష్ట‌పోయేది ఏమీ ఉండ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని