క్రిప్టోపై ఇన్ని ఊహాగానాలా? ఏమాత్రం మంచిదికాదు: నిర్మలా సీతారామన్‌

క్రిప్టోకరెన్సీపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అసహనం వ్యక్తంచేశారు. అది ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు...

Published : 04 Dec 2021 21:49 IST

దిల్లీ: క్రిప్టోకరెన్సీపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అసహనం వ్యక్తంచేశారు. అది ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సంబంధించి కేంద్రం త్వరలో బిల్లు తీసుకొస్తున్న వేళ ‘హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆమె శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో క్రిప్టో గురించి అడిగిన ఓ ప్రశ్నకు ‘‘క్రిప్టో కరెన్సీపై చాలా వరకు ఊహాగానాలు వస్తున్నాయి. అది ఏమాత్రం  సమంజసం కాదు’’ అని సమాధానం ఇచ్చారు.

ది క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2021ని కేంద్రం ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీల నిషేధంతో పాటు డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తీసుకొస్తోంది. అయితే, క్రిప్టోకరెన్సీ వినియోగం వెనుక ఉన్న సాంకేతికతను ఉపయోగించుకునే విధంగా కొన్ని మినహాయింపులు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం మదిలో ఆలోచన ఏముందో బిల్లు వస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని