Budget 2022: ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్రాలదే.. అందుకే తక్కువ కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ఆరోగ్య రంగానికి తక్కువ కేటాయించడంపై ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ స్పందించారు. ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా రాష్ట్రాల బాధ్యతే

Published : 21 Feb 2022 14:50 IST

ముంబయి: కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ఆరోగ్య రంగానికి తక్కువ కేటాయించడంపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ స్పందించారు. ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా రాష్ట్రాల బాధ్యతే అని అన్నారు. అయితే ప్రజలకు అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్రం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బృందం నేడు పరిశ్రమ వర్గాలతో బడ్జెట్ అనంతర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్‌ మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్య రంగానికి జీడీపీలో 1.3శాతం కేటాయింపులు చేశారు. ఇది గతంలో కంటే ఎక్కువే అయినప్పటికీ.. కనీసం 3శాతానికి పైనే కేటాయింపులు ఉంటాయని అంచనా వేశాం’’ అని అన్నారు. దీనికి టీవీ సోమనాథన్‌ స్పందిస్తూ.. ‘‘ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే’’ అని తెలిపారు. అయితే కొన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలను కేంద్రమే అందిస్తోందని అన్నారు. ఇక ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా పేద వర్గాల ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. 

ఇక మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర క్రెడిట్‌ లింక్డ్‌ గ్యారెంటీ పథకాన్ని అందిస్తోన్నట్లు ఆయన గుర్తు చేశారు. దీని ద్వారా ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్ల వరకు ద్రవ్య సరఫరా చేసేందుకు వీలుందని, దీన్ని కార్పొరేట్‌ రంగం వినియోగించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని