4జీ యులిప్స్ గురించి తెలుసా?
ఎక్కువ రాబడిని ఆశిస్తూ, తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడులు ప్రారంభించేవారికి 4జీ యులిప్స్ సరైనవి.......
ఎక్కువ రాబడిని ఆశిస్తూ, తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడులు ప్రారంభించేవారికి 4జీ యులిప్స్ సరైనవి.
దేశంలో ఉన్న అత్యధిక జనాభా ప్రాతిపదికన 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఉన్నారు. అంటే 2021 నాటికి మూడింటిలో రెండవ వంతు యువకులే ఉంటారు. ఈ తరం వారికి మంచి నాణ్యమైన విద్య, లక్ష్యం, జీవితంలో విజయం సాధించడం చాలా సులభం. మునుపటి తరాల వారిలా కాకుండా వారి ఆలోచనలు మరింత కొత్తగా, దూకుడుగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే వెంటనే సాధించాలనే ఆశయం కలిగి ఉంటారు.
పెట్టుబడుల విషయానికొచ్చేసరికి పెట్టుబడి సాధనాలు అనేక రకాలు ఉన్నాయి. మరి వారికి ఏది సరిపోతుందో, లక్ష్యాలకు అనుగుణంగా ఏది ఉంటుందో దానిని ఎంచుకోవాలి. అందులో ఒకటి యులిప్స్. యులిప్స్ మంచి పెట్టుబడి మార్గం అయినప్పటికీ దీనికి ఖర్చు ఎక్కువ అని ఆలోచిస్తుంటారు.
అయితే ఇప్పుడు కొత్త తరం యులిప్స్(NULIPs) లేదా 4జీ యులిప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పెట్టుబడులు తక్కువ ఖర్చుతో పాటు ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దీర్ఘకాలీక మూలధన పన్ను నుంచి కూడా మినహాయింపు ఉండటంతో ఇప్పుడు పెట్టుబడులకు ఇది సరైన సాధనం. న్యూలిప్స్ లేదా 4జీ యులిప్స్‌లో గరిష్ఠంగా ఈక్విటీ పెట్టుబడులకు 1.35 శాతం, డెట్ ఫండ్లకు 0.95 శాతం ఛార్జీలు వర్తిస్తాయి. అదేవిధంగా మరిన్ని ఫీచర్లు ఏంటంటే జీరో పాలసీ అడ్మిన్ ఛార్జ్, మోర్టాలిటీ వ్యయం వంటివి మెచ్యూరిటీ సమయంలో వెనక్కి వస్తాయి.
4 జీ యులిప్‌లో పెట్టుబడులు ఎలా?
యులిప్‌లు దీర్ఘకాలీక పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న 25 నుంచి 45 సంవత్సరాల వయసు వారికి సరైన ఆప్షన్. 4 జీ యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే అందులో రెండు రకాలుంటాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒకటి వార్షిక ప్రీమియంలు, రెండవది క్రమానుగత పెట్టుబడులు.
వార్షిక ప్రీమియంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడిగా పెట్టాలి. క్రమానుగత ప్రీమియంలలో నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి వాయిదాలకు రూపంలో చెల్లించవచ్చు. వార్షిక ప్రీమింలలో పెడితే లాభ, నష్టాలను అందిపుచ్చుకోలేరు. అయితే వాయిదా పద్ధతిలో చెల్లిస్తే మార్కెట్ల ఒడుదొడుకులను తట్టుకొని సగటు లాభాలను పొందవచ్చు. మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలి. మార్కెట్ ఎక్కువలో ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలి.
వార్షిక ప్రీమియంలో పోలిస్తే, వాయిదాల రూపంలో చెల్లింపులు మేలు ఎందుకంటే, ఇవి సౌకర్యంగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి ప్రీమియం పెట్టకుండా సౌకర్యానుకూలంగా వాయిదాలు చెల్లించవచ్చు. మార్కెట్ లాభ, నష్టాల్లో ఉన్నప్పుడు లాభాలను సమతూల్యం చే్తుంది. ప్రస్తుతం మార్కెట్లు ఉన్న పరిస్థితుల్లో 4జీ యులిప్స్ మంచి పెట్టుబడి సాధనాలని చెప్పుకోవచ్చు. యులిప్స్‌లో ఈక్విటీల నుంచి డెట్లలోకి మారే అవకాశముందన్న సంగతి తెలిసిందే. 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉన్నప్పటికీ ఈ ప్రయోజనం పొందవచ్చు. మార్కెట్ల నష్టభయాల గురించి భయపడేవారికి ఇది సరైన ఆప్షన్.
మార్కెట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నప్పటికీ, బజాజ్ అలియాంజ్ అందించే గోల్ అష్యూర్ ప్లాన్, ఇందులో మెచ్యురిటీ సమయంలో మోర్టాలిటీ ఛార్జీలు తిరిగి వస్తాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ Click2Invest, ఎడల్ విజ్ నుంచి వెల్త్ప్లస్ ప్లాన్లు సరైనవి. ఇటీవల కాలంలో మార్కెట్లోకి Canara HSBC OBC కొత్తగా వచ్చింది. 4 జీ ప్లాన్ ఇందులో అందుబాటులో ఉంది. ఇందులో 7 రకాల ఫండ్లు, 4 పోర్ట్‌ఫోలియో వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!