చౌక వ‌డ్డీ రేట్ల‌కే కారు రుణాలు.. ఏయే బ్యాంకుల్లో ఎంతెంత..?

కారు కొనుగోలుకు రుణాలు బ్యాంకులు విరివిగా ఇస్తున్నాయి.

Updated : 28 Aug 2021 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక‌ప్పుడు ఉన్న‌త వ‌ర్గాల‌కే అందుబాటులో ఉండే కారు.. ఇప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తికి కూడా అందుబాటులోకి వ‌చ్చేసింది. ఈ మధ్యకాలంలో కార్లు కొనుగోలు చేసేవారిలో స‌గానికిపైగా మ‌ధ్య‌, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గీయులే ఉంటున్నారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి ఆదాయ ప్ర‌మాణాలు పెర‌గ‌డంతో కార్ల కొనుగోలు ఎక్కువైంది. ఒక‌ప్పుడు జీవితంలో బాగా స్థిర‌ప‌డితే కానీ కారు కొనుగోలు చేసేవారు కాదు.. అలాంటిది ఇంకా వివాహం కాని యువ‌తీ యువ‌కులు కూడా సొంత కార్లకు రైడ‌ర్లు అయిపోతున్నారు. ముగ్గురు, న‌లుగురు ఉండే కుటుంబం సైతం కారు కోనుగోలుకు మొగ్గు చూపుతోంది. వాయు కాలుష్యంతో ఇబ్బంది ప‌డేవారు సైతం కారు కొనుగోలుకు ప్రాధాన్య‌ం ఇస్తున్నారు.

కారు కొనుగోలుకు రుణాలు బ్యాంకులు విరివిగా ఇస్తున్నాయి. చాలా బ్యాంకులు ధ‌ర‌లో 80-90% వ‌ర‌కు 7 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి కూడా రుణాలు అంద‌చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎంపిక చేసిన క‌స్ట‌మ‌ర్ల‌కు ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ డీల్స్‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన రేట్ల‌తో ఆఫ‌ర్ చేస్తున్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌తో స‌హా అగ్ర‌శ్రేణి కార్ల త‌యారీ కంపెనీల దేశీయ అమ్మ‌కాలు ఈ ఏడాది జులైలో వ‌రుస‌గా 37%, 26%, 101% పెరిగాయి. ప‌బ్లిక్‌, షేర్డ్ ట్రాన్స్‌పోర్టేష‌న్‌ను త‌గ్గించ‌డానికి, కొవిడ్ బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి చాలా మంది కారు కొన‌డానికి ప్రాధాన్య‌ం ఇస్తున్నార‌న‌డానికి ఈ అమ్మ‌కాలే నిద‌ర్శ‌నం.

కార్ల అమ్మ‌కాలు పెర‌గ‌డానికి ఇంకో కార‌ణం వ్య‌క్తిగ‌త రుణాల కంటే కూడా ఈ మోటారు రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు లభించడం. కాబ‌ట్టి చాలా మంది మోటారు రుణాల‌తో కార్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. మీ వ‌య‌స్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్‌, రుణ మొత్తం మొద‌లైన వాటి ఆధారంగా మీకు వ‌ర్తించే కారు రుణ వ‌డ్డీ రేటు బ్యాంక్ నిర్ణయిస్తుంది. కారు రుణాలు 6.80% నుంచి ప్రారంభమవుతున్నాయి. 18 ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకుల లిస్ట్ దిగువ ప‌ట్టిక‌లో ఉన్నాయి. ప్ర‌తి బ్యాంకు 5 సంవ‌త్స‌రాల కాలానికి, రూ.10.5 ల‌క్ష‌ల రుణం కోసం ఎంతెంత ఈఎమ్ఐలు వసూలు చేస్తున్నాయో ఇందులో ఉంది.

ప్రాసెసింగ్ ఫీజు, ఇత‌ర ఛార్జీలు ఈఎమ్ఐలో క‌లిపి లేవు. అయితే, ప్ర‌తి బ్యాంకు అత్య‌ల్పంగా ప్ర‌క‌టించిన వ‌డ్డీ రేటును మాత్ర‌మే ప‌రిగ‌ణించాం. మీ రుణ మొత్తం, క్రెడిట్ స్కోర్‌, చేసే వృత్తి, మీరు ఎంచుకున్న బ్యాంకు ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌పై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటులో మార్పు ఉంటుంది. *ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని