Personal Loans: వ్య‌క్తిగ‌త రుణాల వ‌డ్డీ రేట్లు.. ఏ బ్యాంక్‌లో ఎంతెంత?

ఏ ఇత‌ర రుణం క‌న్నా కూడా ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి.

Updated : 06 Nov 2021 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌గిన అర్హ‌త‌లు ఉన్న‌వారికి ఎటువంటి పూచీకత్తూ  లేకుండా వ్య‌క్తిగ‌త రుణాల‌ను బ్యాంకులు అంద‌జేస్తున్నాయి. వ్య‌క్తిగ‌త రుణం తీసుకునే ముందు కొన్ని ముఖ్య‌మైన‌ విష‌యాలు తెలుసుకోవాలి. ఇతర రుణాల కన్నా ఈ వ‌డ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాన్ని అసుర‌క్షిత రుణంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. వీటికి ఎలాంటి ఆస్తులూ తాక‌ట్టు పెట్టాల్సిన అవసరం లేదు. క్రెడిట్ స్కోరు 750 దాటి ఉన్న వారికి  లోన్ ఇవ్వ‌డంలో ప్రాధాన్య‌ం ఉండ‌ట‌మే కాకుండా వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ ఉండే అవ‌కాశ‌ముంది. క్రెడిట్ స్కోర్ త‌క్కువ ఉన్న వారికి కూడా కొన్ని రుణ సంస్థ‌లు, ఫిన్‌టెక్‌లు సంస్థ‌లు రుణాలు ఇచ్చే అవ‌కాశ‌ం ఉన్నప్పటికీ అధిక వ‌డ్డీని వసూలు చేస్తాయి.

రుణ అర్హ‌త ప్ర‌మాణాలు: జీతాలు, స్వ‌యం ఉపాధి పొందుతున్న వారికి రుణ అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణం కోరుకునే జీతం పొందే వ్యక్తులు 3 నెల‌ల పే స్లిప్‌లు, ఫార‌ం-16, గ‌డిచిన‌ సంవ‌త్స‌ర ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌ల‌ను అందించాల్సి ఉంటుంది. స్వ‌యం ఉపాధి పొందుతున్న వ్య‌క్తుల‌యితే గ‌త 2 సంవ‌త్స‌రాల్లో ఆడిట్ చేసిన ఫైనాన్షియల్‌ ఐటీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వారి వ్యాపారం క‌నీసం 2 ఏళ్ల పాటు ర‌న్నింగ్‌లో ఉండి ప్రస్తుతం కొన‌సాగుతూ ఉండాలి. వారు వైద్యులు, సీఏలు మొద‌లైన నిపుణులు అయితే ప్రాక్టీస్ చేయ‌డానికి లైసెన్స్‌లు కూడా క‌లిగి ఉండాలి. మీరు ఇప్ప‌టికే ఇత‌ర రుణ సంస్ధ‌ల్లో ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుని కొన‌సాగిస్తుంటే ఆ రుణాన్ని తీర్చేయ‌డం మంచిది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ పెర‌గ‌డ‌మే కాకుండా, కొత్త రుణ అర్హ‌త‌ను పెంచుకొన్న‌వాళ్లు అవుతారు.

5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో రూ. 2.5 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప్ర‌స్తుతం అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న 25 బ్యాంకుల ‘ఈఎంఐ’లు ఇక్కడ ఉన్నాయి.

* ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు ‘ఈఎంఐ’లలో చేర్చలేదు. టేబుల్‌లో తెలిపిన ఈఎంఐ.. వ‌డ్డీ ఆధారంగా లెక్కించినది మాత్రమే. ఆయా బ్యాంక్‌ నిబంధనలు, షరతుల ఆధారంగా ఆ మొత్తం మారొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని