Intrest Rates: ప్ర‌ముఖ‌ బ్యాంకులు అందించే వ్య‌క్తిగ‌త రుణాలు - వ‌డ్డీ రేట్లు

అయితే ఇల్లు, కారు రుణాల‌కంటే ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేటు ఎక్కువ‌.

Updated : 18 Oct 2021 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త్‌లో పేరున్న ప్ర‌భుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాల‌ను త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే అందిస్తున్నాయి. ఎటువంటి పూచీక‌త్తు లేకుండా కేవ‌లం క్రెడిట్ స్కోర్‌, బ్యాంక్‌లో ఆయా క‌స్ట‌మ‌ర్స్ నిర్వ‌హించే ఖాతాలను బట్టి రుణాల‌ను అంద‌జేస్తున్నాయి. ఇప్ప‌టికే బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న‌, క్రెడిట్ కార్డు ఉన్నా కూడా మీరు నిర్వ‌హించే ఖాతాల‌ను బ‌ట్టీ, చెల్లింపుల హిస్ట‌రీ చూసి బ్యాంకులు రుణాల‌ను ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపుతాయి. అయితే ఇల్లు, కారు రుణాల‌కంటే ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేటు ఎక్కువ‌. అయితే, మీరు ఈ రుణం పొంద‌టానికి ఆస్తి, బంగారం వంటి ఆస్తుల‌ను బ్యాంకు వ‌ద్ద త‌న‌ఖా ఉంచాల్సిన అవ‌స‌రం లేదు. మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.

వివిధ బ్యాంకులు అందించే అతి త‌క్కువ వ్య‌క్తిగ‌త రుణ వ‌డ్డీ రేట్లు దిగువ ప‌ట్టిక‌లో ఉన్నాయి..

*ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

బ్యాంకుల వెబ్‌సైట్‌ల ప్ర‌కారం ఈ డేటా 14 అక్టోబ‌ర్ 2021 నాటిది. వ‌డ్డీ రేటు ఆధారంగా ఈఎంఐ లెక్కించడమైంది. వాస్త‌వ ప‌రిస్థితిలో ఇత‌ర ఫీజులు, ఛార్జీల‌ను ఉండొచ్చు. అలాగే, జీతం పొందే వ్య‌క్తులు, పెన్ష‌న‌ర్ల‌కు, సుర‌క్షితం కాని ఖాతాదారుల‌కు వ‌డ్డీ రేట్లు బ్యాంకులు వేర్వేరుగా విధించ‌వ‌చ్చు. క్రెడిట్ ప్రొఫైల్‌, రుణ మొత్తం, కాల‌వ్య‌వ‌ధి, మీరు ప‌నిచేసే కంపెనీను బ‌ట్టి బ్యాంక్ నిర్ణ‌యిస్తుంది. అత్య‌వ‌స‌ర సందర్భాల్లో మాత్ర‌మే ఈ రుణాలను తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని