LPG cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి.
దిల్లీ: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. ఒక్కో సిలిండర్‌పై ₹115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹1,744కి, ముంబయిలో ₹1,696కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. జులై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.
ఏటీఎఫ్ ధర పెంపు
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊరట కల్పించిన చమురు కంపెనీలు.. విమానాల్లో వాడే ఇంధనం (ATF) ధరను మాత్రం పెంచింది. కిలోలీటర్ జెట్ ఫ్యూయల్‌ను 4.2 శాతం మేర పెంచాయి. దీంతో దిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర ₹ 4,842.37 పెరిగి.. ₹ 120,362.64కు చేరింది. గత నెల ఏటీఎఫ్ ధరలు తగ్గగా.. ఈ నెల పెరగడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IAF: వాయుసేనకు భారీ నష్టం.. ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు
-
Politics News
Yuvagalam: వైకాపా చేసేది సామాజిక అన్యాయమే: లోకేశ్
-
Politics News
MNM: కాంగ్రెస్‌లో విలీనమా.. అదేం లేదు: వెబ్సైట్ హ్యాక్ అయిందన్న కమల్ పార్టీ
-
Movies News
Ayali Review: రివ్యూ: అయలీ.. దేవత దర్శనం ఆ అమ్మాయిలకేనా?
-
Sports News
IND vs NZ: అదే మా కొంప ముంచింది..: హార్దిక్ పాండ్య
-
India News
Modi: నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు: ‘సింధూ జలాల’పై ఆనాడే హెచ్చరించిన మోదీ