Mahindra: మరోసారి వాహన ధరలు పెంచిన మహీంద్రా.. ఎంత శాతమంటే!

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా మరోసారి వాహనాల ధరలు పెంచింది. 2.5 శాతం మేర ధరలు పెంచినట్లు కంపెనీ గురువారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఏప్రిల్‌ 14 నుంచే ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని...

Updated : 14 Apr 2022 16:03 IST

దిల్లీ: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా మరోసారి వాహనాల ధరలు పెంచింది. 2.5 శాతం మేర ధరలు పెంచినట్లు కంపెనీ గురువారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఏప్రిల్‌ 14 నుంచే ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని వెల్లడించింది. ఫలితంగా వాహనం మోడల్‌, వేరియంట్‌ను బట్టి ఎక్స్‌- షోరూం ధరలు రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. స్టీల్‌, అల్యూమినియం తదితర ముడిసరకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. పెరిగిన ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఈ క్రమంలోనే ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు