Mahesh Babu: డాలర్‌ ప్రచారకర్తగా మహేశ్‌ బాబు

దక్షిణ భారత్‌లో విస్తరించేందుకు 2027 నాటికి కొత్తగా 50 విక్రయ కేంద్రాలు నెలకొల్పుతామని హొజైరీ (ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌) ఉత్పత్తుల సంస్థ డాలర్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

Published : 14 Jun 2024 02:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ భారత్‌లో విస్తరించేందుకు 2027 నాటికి కొత్తగా 50 విక్రయ కేంద్రాలు నెలకొల్పుతామని హొజైరీ (ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌) ఉత్పత్తుల సంస్థ డాలర్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. తమ మొత్తం ఆదాయంలో దక్షిణాది వాటా 8 శాతంగా ఉండగా, 20% ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌ గుప్తా గురువారం ఇక్కడ తెలిపారు. అమ్మకాలు పెంచుకునేందుకే దక్షిణ భారతంలో ప్రచారకర్తగా సినీ నటుడు మహేశ్‌ బాబును నియమించుకున్నట్లు వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సంస్థ మొత్తం ఆదాయాన్ని రూ.2,000 కోట్లకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని