మహీంద్రా అదుర్స్‌.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్‌ కంపెనీగా..

Mahindra & Mahindra: భారత్‌లోని అత్యంత విలువైన ఆటో మొబైల్‌ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్‌ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది.

Published : 14 Jun 2024 17:14 IST

Mahindra & Mahindra | ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్‌ సంస్థగా ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra) నిలిచింది. మార్కెట్‌ విలువ పరంగా టాటా మోటార్స్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈరోజు మార్కెట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో కంపెనీ షేర్ల విలువ పెరగడంతో ఈ స్థానం దక్కించుకుంది.

మార్కెట్‌ విలువ పరంగా (market capitalisation) మారుతీ సుజుకీ ఇండియా రూ.4.04 లక్షల కోట్లతో మొదటిస్థానంలో నిలవగా రూ.3.64 లక్షల కోట్లతో మహీంద్రా అండ్‌ మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. 2024లో ఇప్పటివరకు నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. స్టాక్ దాదాపు 65శాతం పెరిగింది. దీంతో గత 12 నెలల్లో కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లు పెరిగింది.

డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌లో శిక్షణ.. జొమాటో గిన్నిస్‌ రికార్డ్‌

మహీంద్రా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. అందులోభాగంగా 2025-27 మధ్య రూ.27 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇన్వెస్టర్ల సమావేశంలో శుక్రవారం తెలిపింది. 2026 మార్చి నాటికి ఈవీ, ఎస్‌యూవీ వాహనాల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 72,000 యూనిట్లు పెంచాలని చూస్తోంది. 2030 నాటికి డీజిల్‌, గ్యాసోలైన్‌తో నడిచే ఎస్‌యూవీలతో పాటు మరో ఆరు కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  దీంతో మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేర్లు 2.18శాతం పెరిగి రూ.2,924.00 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని