మ‌హీంద్రా ఫైనాన్స్‌ అధిక వ‌డ్డీ రేటు డిజిటల్ డిపాజిట్

మ‌హీంద్రా ఫైనాన్స్ సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాలు `క్రిసిల్‌` ద్వారా `FAAA` రేటింగ్ చేయ‌బ‌డ్డాయి.

Updated : 07 Apr 2022 12:51 IST

మ‌హీంద్రా ఫైనాన్స్ 0.25% అధిక వ‌డ్డీ రేటుతో ప్ర‌త్యేక డిపాజిట్ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ కంపెనీ డిజిట‌లైజేష‌న్ డ్రైవ్‌లో భాగంగా ప్ర‌త్యేకంగా త‌గిన‌ మొత్తంలో డిపాజిట్ చేసే సంప‌న్న డిపాజిటర్ల కోసం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో డ‌బ్బు డిపాజిట్ చేసే మ‌దుపుదారులు త‌గిన సంస్థ‌ల/క‌ంపెనీల‌తో నేరుగా క‌లుసుకునే అవ‌కాశం ఉంద‌ని కంపెనీ తెలిపింది. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌డానికి ఈ ప‌థ‌కం ఎంత‌గానో దోహద పడుతుందని కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు.

డిపాజిట‌ర్లు  వాయిదాల ప‌ద్ధ‌తిలో వ‌డ్డీ తీసుకోవ‌డానికి లేదా డిపాజిట్ మెచ్యూరిటీ అయిన త‌ర్వాత తీసుకోవ‌డానికి నాన్‌-క్యుములేటివ్, క్యుములేటివ్ ఎంపిక‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ప‌థ‌కం కంపెనీ ఇప్ప‌టికే అందిస్తున్న ప్ర‌స్తుత డిపాజిట్ ప‌థ‌కాల‌కు అద‌నం. ఈ ప్ర‌త్యేక డిపాజిట్ ప‌థ‌కం డిజిటల్ పద్ధతి లో కంపెనీ యొక్క బ‌హుళ ఆర్ధిక/పెట్టుబ‌డి పథకాలలో భాగం. మ‌హీంద్రా ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాలు 'క్రిసిల్‌ FAAA' రేటింగ్ చేయ‌బ‌డ్డాయి. ఇది అత్య‌ధిక ఆర్ధిక భ‌ద్ర‌త‌ను సూచించే క్రెడిట్ రేటింగ్‌.

కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈ డిపాజిట్ ప‌థ‌కాల‌ను అందిస్తుంది. ఈ ప‌థ‌కాల కింద మ‌దుపుదార్లు త‌మ పెట్టుబ‌డుల‌ను 30, 42 నెల‌ల కాల వ్య‌వ‌ధిలో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇది 6.20%, 6.50% వ‌డ్డీ రేట్ల‌ను క‌లిగి ఉంది.  ఇంకా సీనియ‌ర్ సిటిజ‌న్లు మ‌రో 0.20% అధిక వ‌డ్డీ రేట్లు పొందేందుకు అర్హులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని