Loans: యూజ్డ్‌ కార్‌ డిజీ లోన్స్‌ ప్రారంభించిన మహీంద్రా ఫైనాన్స్‌

సెకండ్‌ హాండ్‌ వాహనాల కొనుగోలుదార్లకు సులభంగా, వేగంగా రుణాలను అందజేయడానికి మహీంద్రా ఫైనాన్స్‌ ‘డిజి లోన్స్‌’ సేవలను ప్రారంభించింది.

Published : 03 Mar 2023 17:35 IST

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ‘యూజ్డ్‌ కార్‌ డిజీ లోన్స్‌’ను ప్రారంభించింది. మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (MMFSL), ‘మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌’, కార్‌& బైక్‌, కార్‌దేఖో ద్వారా రూపీతో కలిసి ఈ సేవలను ప్రారంభించింది. వినియోగదారులకు అత్యాధునిక ఫిన్‌టెక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని గంటల వ్యవధిలోనే రుణాన్ని పంపిణీ చేస్తుంది. ఈ సేవలు భారతదేశం అంతటా లభిస్తాయని మహీంద్రా ఫైనాన్స్‌ ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని