Supro CNG Duoతో డ్యుయల్ ఫ్యుయెల్ విభాగంలోకి మహీంద్రా!
సుప్రో సీఎన్‌జీ డ్యుయోలో 75 లీటర్ల సామర్థ్యంతో కూడిన సీఎన్‌జీ ట్యాక్ ఉంది. దీన్ని పూర్తిగా భర్తీ చేస్తే 325 కి.మీ వరకు ప్రయాణించొచ్చు.
దిల్లీ: సీఎన్‌జీ డ్యుయో (Supro CNG Duo)ను మహీంద్రా అండ్ మహీంద్రా సుప్రో గురువారం విడుదల చేసింది. దీంతో ఈ కంపెనీ డ్యుయల్- ఫ్యుయెల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. దీని ధర రూ.6.32 లక్షలు (ఎక్స్‌షోరూం). ఈ మోడల్ సీఎన్‌జీ, పెట్రోల్ రెండు రకాల ఇంధనాలతో నడుస్తుంది. ఇది 750 కిలోల వరకు బరువును మోస్తుంది.
సుప్రో సీఎన్‌జీ డ్యుయో (Supro CNG Duo)లో 75 లీటర్ల సామర్థ్యంతో కూడిన సీఎన్‌జీ ట్యాంక్ ఉంది. దీన్ని పూర్తిగా భర్తీ చేస్తే 325 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. ఐదు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. గత నాలుగేళ్లలో సీఎన్‌జీ సెగ్మెంట్ నాలుగింతలు వృద్ధి చెందినట్లు ఎంఅండ్‌ఎం ఉపాధ్యక్షుడు బనేశ్వర్ బెనర్జీ తెలిపారు. 2 టన్నుల కేటగిరీలో నెలకు 16,000 యూనిట్లు అమ్ముడైతే వాటిలో 5,000 సీఎన్‌జీవే ఉంటున్నాయని వెల్లడించారు. సుప్రో సీఎన్‌జీ డ్యుయోతో ఆ మార్కెట్‌ను ఒడిసిపట్టడమే ఎంఅండ్‌ఎం లక్ష్యమని పేర్కొన్నారు. 27 బీహెచ్‌పీ శక్తిని, 60ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజిన్ ఉన్నట్లు తెలిపారు. ఒక కేజీ సీఎన్‌జీకి 23.35 కి.మీ ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్