Scorpio Classic: మహీంద్రా నుంచి స్కార్పియో క్లాసిక్‌ @ ₹11.99 లక్షలు

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్ కొత్తగా స్కార్పియో క్లాసిక్‌ (Scorpio Classic) మోడల్‌ను ఆవిష్కరించింది. క్లాసిక్‌-ఎస్‌, క్లాసిక్‌ -11 పేరిట రెండు వేరియంట్లను తీసుకొచ్చింది.

Published : 19 Aug 2022 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్ కొత్తగా స్కార్పియో క్లాసిక్‌ (Scorpio Classic) మోడల్‌ను ఆవిష్కరించింది. క్లాసిక్‌-ఎస్‌, క్లాసిక్‌ -11 పేరిట రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలను తాజాగా రివీల్‌ చేసింది. క్లాసిక్‌-ఎస్‌ ధరను రూ.11.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించింది. క్లాసిక్‌ ఎస్‌-11 ధరను రూ.15.49 లక్షలుగా పేర్కొంది. రెడ్‌, బ్లాక్‌, సిల్వర్‌, వైట్‌ కలర్స్‌లో ఈ మోడల్‌ లభ్యమవుతుంది. 

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. గత మోడళ్లతో పోలిస్తే  క్లాసిక్‌ మోడల్‌ బరువు 55 కిలోలు తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. 2.2 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ 132 పీఎస్‌ పవర్‌ను, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ అందిస్తున్నారు. గత మోడళ్లతో పోలిస్తే 14 శాతం అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మెరుగైన సస్పెన్షన్‌, ఆర్‌17 డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌, నూతన డీఆర్‌ఎల్‌ వంటి ప్రత్యేకతలు దీంట్లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. 9 అంగుళాల టచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో స్క్రీన్‌ మిర్రరింగ్‌ సదుపాయం ఉంది. 7 సీటర్‌, 9 సీటర్‌ ఆప్షన్స్‌తో ఈ మోడల్‌ వస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts