Mahindra Thar: మరింత అందుబాటు ధరలో థార్.. RWD వేరియంట్ విడుదల
మహీంద్రా థార్(Mahindra Thar)ను ప్రజలకు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా రేర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రతిష్ఠాత్మక థార్ (Mahindra Thar) మోడల్‌లో రేర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. ధర రూ. 9.99 లక్షల నుంచి ట్రిమ్‌ను బట్టి రూ. 13.49 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లో దీన్ని తీసుకొచ్చారు. క్రితం 4x4 వీల్ డ్రైవ్‌తో పోలిస్తే స్వల్ప మార్పులు కూడా చేయడం గమనార్హం. AX(O), LX అనే రెండు ట్రిమ్‌లలో RWD అందుబాటులో ఉంది.
4x4తో పోలిస్తే RWD పెట్రోల్ ఇంజిన్ శక్తి, సామర్థ్యాల్లో ఎలాంటి మార్పులు లేవు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. తాజా RWDలో 1.5 లీటర్ CRDe డీజిల్ ఇంజిన్ 117 బీహెచ్‌పీ శక్తిని, 300 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఇంజిన్ స్టాప్- స్టార్ట్ టెక్‌ను కూడా పొందుపర్చారు. 6- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. ఆటోమేటిక్ ఆప్షన్ లేకపోవడం గమనార్హం.
కారు రూపురేఖల్లో మాత్రం పెద్దగా మార్పులేమీ లేవు. అయితే, వెనుక ఫెండర్లపై 4x4 బ్యాడ్జింగ్ ఉండదు. లోపల చూస్తే 4x4లో ఇచ్చిన సెకండ్ లివర్ స్థానంలో అదనపు స్టోరేజీ పాకెట్‌ను ఇచ్చారు. డ్యాష్‌బోర్డులో కొత్తగా స్విచ్‌గేర్‌ను కూడా ఇచ్చారు. కొత్తగా బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ రంగుల్లోనూ థార్‌ను తీసుకొచ్చారు. అలాగే 4x4 తరహాలో ఫోల్డింగ్ సాఫ్ట్- టాప్ అందుబాటులో లేదు.
రిమోట్ లాకింగ్, రేర్ డీఫాగర్, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్లు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్‌తో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, టైర్ డైరెక్షన్ ఇండికేటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, ఈఎస్‌పీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4x4కు కావాల్సిన అదనపు విడిభాగాలు లేకపోవడంతో పాటు మెకానికల్‌గా కొన్ని మార్పులు చేయడం వల్ల RWD ధర కొంత మేర తగ్గింది. 4x4తో పోలిస్తే RWD పెట్రోల్ వేరియంట్ ధర రూ. 2.33 లక్షలు తగ్గింది. కొత్తగా తీసుకొచ్చిన డీజిల్ వేరియంట్ ధర రూ. 4లక్షల వరకు తక్కువకు వస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ధరలు తొలి 10 వేల బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. జనవరి 15, 2023 నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని వెల్లడించింది.
4x4 థార్‌లోనూ మహీంద్రా 2023 వెర్షన్‌ను తీసుకొచ్చింది. బోష్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ గ్రిప్ ఉన్న ప్రదేశాల్లోనూ కారు సమర్థంగా ముందుకు దూసుకెళ్తుందని కంపెనీ తెలిపింది. వెనుక సీట్లకు కప్‌హోల్డర్లతో కూడిన ఆర్మ్‌రెస్ట్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లను అందిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం