Income tax: కొత్త పన్ను విధానం.. రూ.7లక్షల వరకూ రాయితీ.. శ్లాబుల కుదింపు
ఆదాయపన్ను విషయంలో ఈ సారి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు యత్నించింది.
ఇంటర్నెట్‌డెస్క్: వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income tax) విధానానికి సంబంధించి ఈ సారి బడ్జెట్ (union budget 2023)లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్ ఆప్షన్‌గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు ఎప్పటిలా అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావచ్చు. కొత్త పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్‌లో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి...
కొత్త పన్ను విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ, ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు పెంచారు. రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు.
కొత్త ఆదాయ పన్ను విధానంలోని శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా.. వాటిని తాజాగా 5కు కుదించారు.
- రూ.3 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు.
- రూ.3-6 లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు.
- రూ.6-9 లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి.
- రూ.9-12 లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను కట్టాలి.
- కొత్త విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు విధిస్తారు.
ఉదాహరణకు ‘ఎ’ అనే వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం పొందితే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ఇచ్చారు. దీంతో రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వార్షికాదాయం రూ.15 లక్షలు ఉంటే రూ.1.5లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. గతంలో ఇది రూ. 1.87 లక్షల వరకు ఉంది. అత్యధిక ఆదాయపన్నుపై సర్‌ఛార్జి రేటును 37శాతం నుంచి 25శాతానికి తగ్గించారు.
* కొత్త పన్ను విధానంలో రూ.15.5 లక్షల ఆదాయం దాటితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.52,500గా ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Ts-top-news News
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు