అపాయింట్‌మెంట్‌ తీసుకుని పిల్లల ఆధార్ నమోదు చేసుకోండి..

దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఏ వయస్సు వారైనా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఎవరైనా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన 12 అంకెల సంఖ్యను ఐడెంటిటీ ప్రూఫ్ గా ఉపయోగించుకోవచ్చు...

Updated : 01 Jan 2021 18:01 IST

దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఏ వయస్సు వారైనా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఎవరైనా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన 12 అంకెల సంఖ్యను ఐడెంటిటీ ప్రూఫ్ గా ఉపయోగించుకోవచ్చు.

ఆధార్ నమోదు ప్రక్రియ పేద్దవారికి, పిల్లలకు ఒకే విధంగా ఉంటుంది. తల్లిదండ్రులు సమీప ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫారమ్ ను నింపాలి. పిల్లలకు ఆధార్ కార్డును ఉచితంగా జారీ చేస్తారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నుంచి బయోమెట్రిక్ డేటాను సేకరించరు.

తల్లిదండ్రుల యూఐడీని పరిగణనలోకి తీసుకోని పిల్లలకు ఆధార్ నెంబర్ ను జారీ చేస్తారు. అనంతరం పిల్లలకి 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత వారి పది వేళ్ల బయోమెట్రిక్స్, పేస్ ఫోటో, ఐరిస్ స్కాన్ తో కూడిన బయోమెట్రిక్‌లను అప్ డేట్ చేయడం తప్పనిసరి.

పిల్లలకు ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి :

  • మీ పిల్లలను ఎన్రోల్ చేసుకోవడానికి మీ సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లండి.
  • పిల్లల జనన ధృవీకరణ పత్రంతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ అవసరం.
  • పిల్లలకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి నుంచి బయోమెట్రిక్ సేకరించరు.
  • పిల్లల ఆధార్ వారి తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానించబడుతుంది.

అవసరమైన పత్రాలు :

  • పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా పిల్లల పాఠశాల జారీ చేసిన ఫోటో ఐడీ.
  • పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలు.
  • పిల్లల తల్లిదండ్రుల చిరునామా, ఐడీ ప్రూఫ్.

పిల్లలకు ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ఎలా?

  1. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ లింక్‌ పై క్లిక్ చేయండి.

  2. పిల్లల పేరు, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, తల్లిదండ్రుల ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను పూరించండి.

  3. వ్యక్తిగత వివరాలను నింపిన తరువాత, జనాభా వివరాలను అందించండి.

  4. అనంతరం ‘ఫిక్స్ అపాయింట్‌మెంట్’ బటన్ పై క్లిక్ చేయండి.

  5. అపాయింట్మెంట్ తీసుకున్న తేదీన అవసరమైన అన్ని పత్రాలు, రిఫరెన్స్ నంబర్‌తో పాటు ఫారం ప్రింట్ అవుట్ ను మీతో ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

  6. ఆధార్ కేంద్రంలో మీకు సంబంధించిన అన్ని పత్రాలను ధృవీకరిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత, ఒకవేళ పిల్లల వయస్సు 5 సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే, వారి బయోమెట్రిక్ వివరాలను తీసుకొని ఆధార్ కార్డుతో అనుసంధానిస్తారు.

పిల్లలకి 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది, ఇది పూర్తిగా ఉచితం. అలాగే బయోమెట్రిక్స్ ను అప్ డేట్స్ చేసుకోవడానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కేవలం మీ పిల్లలిని సమీపంలోని ఏదైనా ఆధార్ కేంద్రానికి తీసుకెళ్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని