Airbus: గుజరాత్‌లో ఎయిర్‌బస్‌ C295 తయారీ కేంద్రం

గుజరాత్‌లో ఎయిర్‌బస్‌ C295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. అక్టోబర్‌ 30న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Published : 27 Oct 2022 17:44 IST

దిల్లీ: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎయిర్‌బస్‌ C295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ తయారీ కేంద్రానికి అక్టోబర్‌ 30న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. యూరప్‌ ఆవల C-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

భారత వైమానిక దళంలో పాత Avro-748 విమానాల స్థానంలో ఎయిర్‌బస్‌కు చెందిన C-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా నాలుగేళ్లలో 16 విమానాలను ‘ఫ్లై అవే’ కండీషన్‌లో ఎయిర్‌బస్‌ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL) తయారీ, అసెంబ్లింగ్‌ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎరోనాటికల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ గత వారమే ఆమోదం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు