ఐపీపీబీ జీరో బ్యాలన్స్ పొదుపు ఖాతా ప్రారంభించారా?
ఇటీవల ప్రారంభమైన ఇండియా పోస్ట్పేమెంట్ బ్యాంకు ఆర్థిక సేవలను ప్రతీ ఇంటికీ చేర్చనుంది. దీంతో పాటు బ్యాంకు పొదుపు ఖాతాలో ఎలాంటి నిల్వ ఉండనవసరం లేదు. వార్షికంగా 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది మూడు రకాల పొదుపు ఖాతాలను అందిస్తుంది. రెగ్యులర్, డిజిటల్, బేసిక్ సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించవచ్చు. ఐపీపీబీ మొబైల్ యాప్‌ను
ఇటీవల ప్రారంభమైన ఇండియా పోస్ట్పేమెంట్ బ్యాంకు ఆర్థిక సేవలను ప్రతీ ఇంటికీ చేర్చనుంది. దీంతో పాటు బ్యాంకు పొదుపు ఖాతాలో ఎలాంటి నిల్వ ఉండనవసరం లేదు. వార్షికంగా 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది మూడు రకాల పొదుపు ఖాతాలను అందిస్తుంది. రెగ్యులర్, డిజిటల్, బేసిక్ సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించవచ్చు. ఐపీపీబీ మొబైల్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని డిజిటల్ ఖాతాను తెరవవచ్చు. సాధారణ పొదుపు ఖాతాలను పోస్టాఫీస్ లేదా పోస్ట్‌మ్యాన్ ద్వారా ప్రారంభించవచ్చు. ఇందులో చెల్లింపులు సులభంగా చేసుకోవడంతో పాటు కనీస నిల్వలు లేకపోతే ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
కనిష్ఠ లేదా గరిష్ఠ నిల్వలు:
ఆర్బీఐ నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో గరిష్ఠంగా లక్ష రూపాయలకు మించి ఉండకూడదు. అంతకంటే ఎక్కువగా లావాదేవీలు చేస్తే ఆటోమేటిక్‌గా తిరస్కరణకు గురవుతాయి. అందుకే ఐపీపీబీ దీనికి ఒక పరిష్కారం చెప్పింది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాను ప్రారంభించి ఐపీపీబీ ఖాతాకు అనుసంధానం చేయాలి. ఐపీపీబీలో లక్ష రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే అవి పోస్టాఫీస్ పొదుపు ఖాతాకు బదిలీ అవుతాయి. ఇది సాధారణ పొదుపు ఖాతా వంటిది.
వడ్డీ రేటు:
ఐపీపీబీ అన్ని రకాల ఖాతాలపై వార్షికంగా 4 శాతం వడ్డీ అందిస్తుంది. రోజుకి ఖాతాలో ఎంత నగదు ఉందో లెక్కించి దాని ప్రకారం త్రైమాసికానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.
డిపాజిట్ లేదా విత్‌డ్రా నిబంధనలు:
రెగ్యులర్ , డిజిటల్ పొదుపు ఖాతాలో ఎన్ని సార్లు అయినా డబ్బు విత్‌డ్రా లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. అదే బేసిక్ పొదుపు ఖాతాలో అయితే నెలకు నాలుగు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసేందుకు ఐపీపీబీ సేవలు అందుబాటులో ఉన్న దగ్గరలోని పోస్టాఫీస్‌ను సంప్రదించాలి లేదా పోస్టామ్యాన్ లేదా గ్రామీణ్ డక్ సేవక్స్ (జీడీఎస్)కి ఫోన్ చేస్తే వారు మీ ఇంటివద్దకు వస్తారు. అప్పుడు క్యూఆర్ కార్డ్ ద్వారా ఐపీపీబీ ఖాతాలో డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు.
అయితే ఇంటి వద్దకు వచ్చి సేవలు అందించేందుకు మీరు రూ.25 చెల్లించవలసి ఉంటుంది (నగదు ఆధారిత లావాదేవీలకు). డిజిటల్ లావాదేవీల కోసం రూ.15 చెల్లించవలసి ఉంటుంది. అదే మీరు ఐపీపీబీ మొబైల్ యాప్‌ని ఉపయోగించి పేమెంట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ఐపీపీబీ ఖాతాలకు ఏటీఎం కార్డులు ఉండవు కాబట్టి ఏటీఎంలలో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదు.
డిజిటల్ పొదుపు ఖాతా నిబంధనలు:
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కూడా డిజిటల్ పొదుపు ఖాతాను ప్రారంభించే అవకాశాన్ని కల్పించింది. దీంతో మీరు ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఖాతాను ప్రారంభించవచ్చు. అయితే ఇది 12 నెలలు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఈ ఖాతాను సాధారణ పొదుపు ఖాతాగా మార్చుకోవలసి ఉంటుంది. బయోమెట్రిక్ డేటాను పోస్ట్‌మ్యాన్ కు అందించి ఈ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఒకవేళ చేయకపోతే డిజిటల్ సేవింగ్స్ ఖాతా మూసివేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో మిస్టరీ డెత్‌ను ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్