Zuckerberg: ఉద్యోగాల కోతల మధ్య జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్సు పెంపు

Mark Zuckerberg: మెటా ఇప్పటికే పెద్ద మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించింది. మరింత మందికి కూడా ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కంపెనీ భద్రతా భత్యాన్ని పెంచింది.

Published : 16 Feb 2023 13:10 IST

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) సెక్యూరిటీ అలవెన్స్‌ను కంపెనీ భారీగా పెంచింది. కుటుంబంతో కలిసి జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) భద్రత కోసం ఇచ్చే పరిహారాన్ని 4 మిలియన్‌ డాలర్లు పెంచి 14 మిలియన్‌ డాలర్లకు చేర్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెంపు అవసరమని భావించినట్లు కంపెనీ తెలిపింది.

ఇటీవల మెటా తమ వివిధ వ్యాపారాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు మరింత మందిని కూడా సాగనంపే యోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు భద్రతను పెంచినట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ప్రస్తుతం ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో 63.6 బిలియన్‌ డాలర్లతో 16వ స్థానంలో కొనసాగుతున్నారు.

2021లో ఆయన అన్ని రకాల పరిహారాలను కలుపుకొని 27 మిలియన్‌ డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. గత ఏడాది ఆయన తీసుకున్న జీతభత్యాలకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని