
Stock Market Update: ఆఖర్లో అమ్మకాలు..సూచీలకు స్వల్ప నష్టాలు!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే పూర్తిస్థాయి లాభాల్లోకి ఎగబాకి మధ్యాహ్నం 2 గంటల వరకు అదే బాటలో పయనించాయి. ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు క్రమంగా పడుతూ వచ్చాయి. చివరి గంటన్నరలో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలు స్వీకరించారు. రాబోయే రోజుల్లో జరగనున్న పరపతి సమీక్షల్లోనూ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సంకేతాలిచ్చారు. ఇది ఆఖర్లో మార్కెట్ల సెంటిమెంటును పూర్తిగా దెబ్బతీసింది. లోహరంగ షేర్లు అత్యధికంగా నష్టపోగా.. ఆటో షేర్లు భారీగా లాభపడ్డాయి.
ఉదయం సెన్సెక్స్ 54,459.95 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,931.30 - 54,191.55 మధ్య కదలాడింది. చివరకు 37.78 పాయింట్ల నష్టంతో 54,288.61 వద్ద ముగిసింది. 16,290.95 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 51.45 పాయింట్లు నష్టపోయి 16,214.70 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,414.70 - 16,185.75 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.54 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, ఎంఅండ్ఎం, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, సన్‌ఫార్మా, టైటన్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్లోని మరిన్ని సంగతులు..
* మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్ ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో కంపెనీ షేర్లు ఐదు శాతం మేర నష్టపోయాయి. గత మూడు నెలల్లో కంపెనీ షేర్లకు ఇదే అతిపెద్ద ఒకరోజు నష్టం.
* గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు మెప్పించడంతో ఉదయం రాణించిన దివీస్ ల్యాబ్స్ షేర్లు చివరకు 9.25 శాతం నష్టంతో సరిపెట్టుకున్నాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
* ఇముద్ర ఐపీఓకు రెండో రోజైన సోమవారం నాటికి 81 శాతం స్పందన లభించింది. 1.13 కోట్ల షేర్లకుగానూ మదుపర్లు 92.45 లక్షల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
బ్రిటన్ ప్రధానికి కొత్త చిక్కు!
-
India News
Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
-
India News
కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
-
Politics News
Priyanka Chaturvedi: రాజకీయ సంక్షోభంపై బెదిరింపు కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన శివసేన ఎంపీ
-
General News
Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి
-
Politics News
Maharashtra Crisis: ఏక్నాథ్ శిందేకి సపోర్టు చేయడానికి కారణం అదే..: రెబల్ ఎమ్మెల్యే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
- IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి
- బ్రిటన్ ప్రధానికి కొత్త చిక్కు!