Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
Stock Market Opens: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 312 పాయింట్ల నష్టంతో 65,516 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు నష్టపోయి 19,533 దగ్గర కొనసాగుతోంది.
Stock Market Opens | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 312 పాయింట్ల నష్టంతో 65,516 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు కుంగి 19,533 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగి 83.21 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌యూఎల్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
గాంధీ జయంతి నేపథ్యంలో సోమవారం భారత మార్కెట్లు (Stock Market) పనిచేయలేదు. అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో స్థిరపడ్డాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఈ నెల 6న వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించొచ్చనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై వ్యాఖ్యలు సూచీలపై ప్రభావం చూపొచ్చు. 7న జీఎస్‌టీ మండలి సమావేశంపై మదుపర్లు దృష్టిపెట్టొచ్చు. క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్ పన్నులపై జీఎస్‌టీ మండలి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తయారీ, సేవల పీఎంఐ, రుణాల వృద్ధి గణాంకాలపై మదుపర్లు ఈవారం దృష్టి సారించే అవకాశం ఉంది. పండగల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగ, ఆతిథ్య రంగ షేర్లు వెలుగులీనొచ్చని నిపుణులు అంచనా వేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.1,685.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,751.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
గమనించాల్సిన స్టాక్స్..
వైభవ్ జ్యువెలర్స్: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఆభరణాల విక్రయాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైభవ్ జ్యువెలర్స్ షేర్లు నేడు ఎక్స్ఛేంజీల్లో అడుగుపెట్టనున్నాయి.
అరబిందో ఫార్మా: అరబిందో ఫార్మాకు చెందిన ఏపీఐ నాన్-యాంటీబయాటిక్ వ్యాపారం, ఏపీఐ యాంటీబయాటిక్ వ్యాపారం అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు బదిలీ అయ్యాయి. ఈ సంస్థ, అరబిందో ఫార్మాకు సబ్సిడరీ కావడం గమనార్హం.
వేదాంతా: అల్యూమినియం, చమురు-గ్యాస్, ఉక్కు సహా అయిదు కీలక వ్యాపారాలను విడదీసి ప్రత్యేక నమోదిత సంస్థలుగా ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా శుక్రవారం వెల్లడించింది. వాటాదార్లకు విలువ సృష్టించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ రుణాలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం పెరిగింది. అదే సమయంలో డిపాజిట్లలో 23 శాతం వృద్ధి నమోదైంది.
కోల్ ఇండియా: సెప్టెంబరు నెలలో కోల్ ఇండియా ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి 51.4 మిలియన్ టన్నులుకు చేరింది.
ఆస్ట్రా మైక్రోవేవ్: ఆస్ట్రా మైక్రోవేవ్‌కు చెందిన సంయుక్త సంస్థ అయిన ఆస్ట్రా రఫేల్ కామ్‌సన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భారత వాయుసేన నుంచి రూ.96.49 కోట్ల ఆర్డర్లు లభించాయి.
వాహన స్టాక్స్: దేశీయంగా ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు గత నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. పండుగ సీజన్‌లో గిరాకీకి తగ్గట్లు వాహన తయారీ సంస్థలు డీలర్లకు సరఫరా పెంచడం కలిసొచ్చింది. సెప్టెంబరులో పరిశ్రమ స్థాయిలో మొత్తం 3,63,733 వాహనాలు డీలర్లకు సరఫరా అయ్యాయి. ఒకే నెలలో ఈ స్థాయిలో డిస్పాచ్‌లు కావడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 69,333 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు కుంగి 20,853 దగ్గర కొనసాగుతోంది. -
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్‌లతో జాగ్రత్త!
QR code scams: తరచూ క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. -
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని.. సుమారు 10కోట్ల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
గోఫస్ట్ కథ కంచికేనా?
దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్.. ఇక ఎగరకపోవచ్చు. -
ఏఎల్ఎస్ వ్యాధికి నూతన ఔషధం
నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్ ఇంక్., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. -
కార్లు, బైక్‌లకు భలే గిరాకీ
ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్‌లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. -
కొనసాగిన రికార్డుల పరుగు
వరుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. -
తుపాను బాధిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు వాహన సంస్థల మద్దతు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మిగ్జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఆడి, ఫోక్స్‌వ్యాగన్ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. -
ఎయిరిండియా విమానాల ఆర్డరులో మార్పులు
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది. -
పునరుత్పాదక ఇంధనాలపై అదానీ గ్రూప్ రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడి!
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్ 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం వెల్లడించారు. -
సుజుకీ మోటార్ గుజరాత్ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. -
రతన్ టాటా పేరుతో ‘ఫేక్’ సిఫారసులు
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పేరును దుర్వినియోగం చేస్తూ.. వచ్చిన ‘ఫేక్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇచ్చింది. -
1,14,902 అంకురాలకు గుర్తింపు
పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్‌లో 8% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం