Stock Market: కుప్పకూలుతున్న స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు ద్రవ్యోల్బణ భయాలు సూచీలను కిందకు లాగేస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా

Published : 19 May 2022 13:01 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు ద్రవ్యోల్బణ భయాలు సూచీలను కిందకు లాగేస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1300 పాయింట్లు దిగజారి 53వేల మార్క్‌ను కోల్పోగా.. నిఫ్టీ 16వేల మైలురాయి దిగువన ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెన్సెక్స్‌ 1315 పాయింట్లు కుంగి 52,892 వద్ద, నిఫ్టీ 395 పాయింట్ల నష్టంతో 15,845 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీస్తున్నాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపై తీవ్రంగా పడింది. దీనికి తోడు విదేశీ నిధులు వెనక్కి మళ్లడం, ముడి చమురు ధరల మోత కూడా దేశీయ మదుపర్లలో భయాన్ని నింపింది. ఫలితంగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని