Updated : 24 May 2022 16:55 IST

stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా మొదలైన సూచీలు చివరి వరకూ ఆ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. దీనికి తోడు ఐటీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడి, బలహీనమైన అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బ తీశాయి. దీంతో నేటి ట్రేటింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 236 పాయింట్లు నష్టపోయి 54,052 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 89 పాయింట్ల నష్టంతో 16,125 పాయింట్ల వద్ద ముగిసింది.

మంగళవారం ఉదయం మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో 132 పాయింట్ల లాభపడి సెన్సెక్స్‌, 41 పాయింట్ల లాభంతో నిఫ్టీ మొదలయ్యాయి. ఇంట్రాడేలో 54,524 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరిన సెన్సెక్స్‌ మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో 53,886 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరిలో కాస్త కోలుకుని 236 పాయింట్ల నష్టంతో 54,052 వద్ద ముగిసింది. నేటి నాటి ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర షేర్లు లాభపడ్డాయి. అదే సమయంలో టెక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని