Maruti Suzuki: మారుతీ సుజుకీ నుంచి కొత్త సూపర్‌ క్యారీ మినీ ట్రక్‌

Maruti Suzuki: మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త సూపర్ క్యారీ మినీ ట్రక్కును సోమవారం విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Published : 17 Apr 2023 17:21 IST

దిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త సూపర్‌ క్యారీ (Super Carry) విడుదల చేసింది. ఆ కంపెనీ నుంచి వస్తున్న అప్‌గ్రేడ్ చేసిన లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌ ఇది. అత్యుత్తమ నాణ్యత, పనితీరుతో ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్లు మారుతీ పేర్కొంది. మినీ ట్రక్‌ ధర రూ.5.15 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్‌ కూడా ఉంది.

1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ ధరలు రూ.5.15 లక్షల నుంచి రూ.5.30 లక్షలుగా కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీఈ వేరియంట్ల ధరలు రూ.6.15 నుంచి రూ.6.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 1.2 లీటర్‌ ఇంజిన్‌లో 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 2016లో ఈ వాహనాన్ని లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షల యూనిట్లను విక్రయించామని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. అప్‌గ్రేడ్‌ చేసిన వెర్షన్‌కూ కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. మారుతీ సుజుకీ షోరూంకు చెందిన 370 ఔట్‌లెట్లలో సూపర్‌ క్యారీ మినీ ట్రక్‌ అందుబాటులో ఉండనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని