Maruti Brezza: మారుతీ కొత్త బ్రెజా బుకింగ్‌లు ప్రారంభం

మారుతీ బ్రెజా 2022 వెర్షన్‌ బుకింగ్‌ (Maruti New Brezaa Bookings)లు ప్రారంభమయ్యాయి....

Published : 20 Jun 2022 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతీ బ్రెజా 2022 వెర్షన్‌ బుకింగ్‌ (Maruti New Brezaa Bookings)లు ప్రారంభమయ్యాయి. రూ.11,000 చెల్లించి ఆన్‌లైన్‌ లేదా మారుతీ (Maruti) డీలర్‌షిప్‌లలో కారును బుక్‌ చేసుకోవచ్చు. ఈ కారు జూన్‌ 30న భారత విపణిలోకి ప్రవేశించనుంది. కొత్త బ్రెజా (Brezza)లో చేసిన పూర్తిస్థాయి మార్పులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, నేటి యువతరం అభిరుచులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పేరులోనూ విటారాను తొలగించి కేవలం బ్రెజాను మాత్రమే ఉంచారు.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, ప్యాడిల్‌ షిఫ్టర్స్‌, ఈఎస్‌పీ వంటి కొత్త ఫీచర్లను 2022 బ్రెజాలో చేర్చినట్లు కంపెనీ తెలిపింది. టీజర్‌ ఇమేజ్‌ను బట్టి చూస్తే ముందు భాగంలో ఎల్‌-ఆకారంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ లైట్లను అమర్చినట్లు తెలుస్తోంది. 1.5 లీటర్‌, కే12సీ పెట్రోల్‌ ఇంజిన్‌ను పొందుపరిచినట్లు సమాచారం.

గతంలో లీక్‌ అయిన పలు ఇమేజ్‌ల ద్వారా బ్రెజా డిజైన్‌లో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త గ్రిల్‌, ముందు, వెనుక బంపర్లు, కొత్త అలాయ్‌ వీల్స్‌, టెయిల్‌గేట్‌లో మార్పులు, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్లను అమర్చినట్లు సమాచారం. 360 డిగ్రీ కెమెరా, స్టాండింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని