Maruti Suzuki Ertiga: 3 నెలల్లోనే ఎర్టిగాలో కొత్త ఫీచర్లు.. మరి ధర పెరిగిందా?

మారుతీ సుజుకీ మూడు నెలల క్రితమే ఫేస్‌లిఫ్ట్‌ ఎర్టిగాను సరికొత్తగా తీర్చిదిద్ది విడుదల చేసింది....

Published : 28 Jul 2022 00:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతీ సుజుకీ మూడు నెలల క్రితమే  ఎర్టిగాను సరికొత్తగా తీర్చిదిద్ది విడుదల చేసింది. తాజాగా ఈ కొత్త వెర్షన్‌లో మరిన్ని ఫీచర్లను జత చేసింది. కొన్ని భద్రతా ఫీచర్లను అన్ని వేరియంట్లకు ప్రామాణికం చేసింది. ధరను కూడా పెంచడం గమనార్హం. ప్రతి వేరియంట్‌పై రూ.6,000 చొప్పున పెంచింది.

ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి భద్రతా ఫీచర్లు ఇప్పుడు అన్ని ఎర్టిగా వేరియంట్లలో ఉన్నాయి. గతంలో ఈ ఫీచర్లు ఆటోమేటిక్‌, టాప్‌-స్పెసిఫికేషన్స్‌ మాన్యువల్‌ వెర్షన్లలో మాత్రమే ఉండేవి. నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు; కెమెరాతో కూడిన రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్; ఈబీడీ, బ్రేక్‌ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఎర్టిగా ధరల శ్రేణి రూ.8.41 లక్షల నుంచి రూ.12.85 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 136.8 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ వద్ద 99 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీన్ని 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌, 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించారు. 7.0 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, క్రూజ్‌ కంట్రోల్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, ఫోల్డబుల్‌ ఓఆర్‌వీఎం.. వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ఎర్టిగా కియా కరెన్స్‌, మహీంద్రా మరాజో, మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 వంటి కార్లకు పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఎర్టిగా వేరియంట్ల ధరలు..

  • ఎల్‌ఎక్స్‌ఐ ఎంటీ - ₹ 8.41 లక్షలు
  • వీఎక్స్‌ఐ ఎంటీ - ₹ 9.55 లక్షలు
  • జెడ్‌ఎక్స్‌ఐ ఎంటీ - ₹ 10.65 లక్షలు
  • జెడ్‌ఎక్స్‌ఐ+ ఎంటీ - ₹ 11.35 లక్షలు
  • వీఎక్స్‌ఐ ఏటీ - ₹ 11.05 లక్షలు
  • జెడ్‌ఎక్స్‌ఐ ఏటీ - ₹ 12.15 లక్షలు
  • జెడ్‌ఎక్స్‌ఐ+ ఏటీ - ₹ 12.85 లక్షలు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని