Maruti Suzuki: కార్లఎగుమతుల్లో మారుతీ సుజుకీ సరికొత్తరికార్డు.. సంస్థ చరిత్రలోనే మొదటిసారి

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. వాహన ఎగుమతుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 2021లో రెండు లక్షలకు పైగా(2,05,450) కార్లను ప్రపంచవ్యాప్తంగా ఆయా మార్కెట్‌లకు సరఫరా చేసింది. ఒక ఏడాదిలో అత్యధిక ఎగుమతుల సంఖ్య ఇదేనని...

Published : 04 Jan 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. వాహన ఎగుమతుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 2021లో రెండు లక్షలకు పైగా (2,05,450) కార్లను ప్రపంచవ్యాప్తంగా ఆయా మార్కెట్‌లకు సరఫరా చేసింది. ఒక ఏడాదిలో అత్యధిక ఎగుమతుల సంఖ్య ఇదేనని సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ మైలురాయి.. సంస్థ కార్ల నాణ్యత, సాంకేతికత, పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌తో పాటు ప్రస్తుత సవాళ్ల తరుణంలోనూ మద్దతుగా నిలిచిన డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు. గ్లోబల్ కస్టమర్ల నమ్మకానికి అనుగుణంగా నడుచుకునేందుకు కంపెనీ కట్టుబడి ఉంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా పేర్కొన్నారు.

ప్రస్తుతం మారుతీ సుజుకీ.. దాదాపు 15 మోడళ్ల కార్లను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2021లో అత్యధికంగా షిప్పింగ్‌ అయిన మొదటి అయిదు మోడళ్లలో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బ్రెజ్జా ఉన్నాయి. సంస్థ మొదటిసారి 1986-87లో హంగేరీకి వాహనాలను ఎక్స్‌పోర్ట్‌ చేసింది. ఇప్పటి వరకు 21.85 లక్షలకుపైగా వాహనాలు ఎగుమతి అయ్యాయి. లాటిన్ అమెరికా, ఆసియాన్‌, మధ్యప్రాచ్య రీజియన్‌లలో ఈ కార్లకు డిమాండ్‌ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు