ఇండియ‌న్ బ్యాంకుతో మారుతీ సుజుకీ జట్టు

ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌లో సుమారు 80% రిటైల్ అమ్మ‌కాలు రుణాల ద్వారానే జ‌రుగుతాయి.

Updated : 28 Apr 2022 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగ‌దారుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన కారు రుణ ప‌థ‌కాల‌ను అందించడానికి మారుతీ సుజుకీ ప్ర‌భుత్వ రంగ బ్యాంకైన ఇండియ‌న్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కారు రుణానికి సున్నా ప్రాసెసింగ్ ఫీజు, ఉచిత ఫాస్ట్‌ట్యాగ్ లాంటివి వినియోగ‌దారులకు అందించనున్నాయి. దీంతో త‌న వినియోగ‌దారుల‌కు అవాంత‌రాలు లేని, ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫైనాన్సింగ్ ఎంపిక‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంలో మారుతీ సుజుకీకి ఇండియ‌న్ బ్యాంక్ తోడ్ప‌డుతుంది.

మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేసే వినియోగ‌దారులు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్ బ్యాంకుకి చెందిన 5,700+ శాఖ‌ల ద్వారా ఈ భాగ‌స్వామ్యం కింద రుణ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు. ఈ ప‌థ‌కం కింద‌ మారుతీ సుజుకీ వినియోగ‌దారులు మొత్తం ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 90 శాతం వ‌ర‌కు ఇండియ‌న్ బ్యాంకు ద్వారా రుణాల‌ను పొందొచ్చు.

అంతేకాకుండా, కొనుగోలుదారులు రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత ప్ర‌మాద బీమా ర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు. రుణానికి ప్రాసెసింగ్ ఫీజు ఉండ‌దు. ఉచిత ఫాస్ట్‌ట్యాగ్ సౌక‌ర్యం ఉంటుంది. అలాగే రుణ చెల్లింపు కోసం 84 నెల‌ల వ‌ర‌కు కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం 2022 జూన్‌ 30 వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌లో సుమారు 80% రిటైల్ అమ్మ‌కాలు రుణాల ద్వారానే జ‌రుగుతాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్ర‌యాణికుల వాహ‌న త‌యారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులతో ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని