Maruti Suzuki: పెరిగిన మారుతీ కార్ల ధరలు.. నేటి నుంచే అమల్లోకి!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి....

Published : 18 Apr 2022 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వహణ, ముడి సరకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలోనే ధరల్ని పెంచినట్లు తెలిపింది. గత ఏడాది కాలంగా పెరుగుతున్న ముడి సరకుల వ్యయాల వల్ల తమ వాహనాల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఫలితంగా కొంత భారాన్ని వినియోగదారుపై మోపక తప్పడం లేదని వివరించింది. మోడల్‌ను బట్టి ధరలు గరిష్ఠంగా 1.3 శాతం వరకు పెరిగినట్లు తెలిపింది. జనవరి 2021 నుంచి మార్చి 2022 మధ్య పలు దఫాల్లో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ధరలు 8.8 శాతం మేర పెరిగాయి. గత జనవరిలో ఈ కంపెనీ కార్ల ధరల్ని 1.7 శాతం వరకు పెంచింది. మారుతీతో పాటు బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్‌, టయోటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌ సైతం ఇటీవల ధరల్ని పెంచిన వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని