Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి

Maruti Suzuki price hike: తయారీ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల ధరల్ని పెంచినట్లు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం ప్రకటించింది.

Updated : 16 Jan 2023 14:53 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ కార్ల ధరల్ని పెంచినట్లు సోమవారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరల్ని పెంచడం ఇది రెండోసారి. 2022 ఏప్రిల్‌లోనూ ధరల్ని పెంచింది. తాజా ధరల పెంపునకు సంబంధించి మారుతీ సుజుకీ (Maruti Suzuki) 2022 డిసెంబరులోనే ప్రకటన చేసింది. తయారీ వ్యయాలు పెరుగుతుండడంతో పాటు కొత్త ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం కోసం పెంపు తప్పడం లేదని తెలిపింది.

మోడళ్లను బట్టి ధరల్ని 1.1 శాతం వరకు పెంచినట్లు మారుతీ సుజుకీ (Maruti Suzuki) వెల్లడించింది. నేటి నుంచే (జనవరి 16) పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఎంట్రీ లెవెల్‌ ఆల్టో నుంచి ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారా వరకు పలు మోడల్‌ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 3.39 లక్షల నుంచి రూ. 19.49 లక్షల (ఎక్స్‌షోరూం- దిల్లీ) మధ్య ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు