Maruti Suzuki: మారుతీ @ 2.5 కోట్లు.. నాలుగేళ్లలో 50 లక్షల వాహనాల ఉత్పత్తి

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 2.5 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసిన సంస్థగా నిలిచింది. 

Published : 02 Nov 2022 17:21 IST

దిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 2.5 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసిన సంస్థగా నిలిచింది. 1983 డిసెంబర్‌లో దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించిన మారుతీ.. 1994 మార్చి నాటికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీగా ఎదిగింది. కోటి వాహనాల మైలురాయిని 2011లో పూర్తి చేసింది. 2018 జులై నాటికి 2 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసిన ఆ కంపెనీ.. నాలుగేళ్లలోనే మిగిలిన 50 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది.

హరియాణాలోని గురుగ్రామ్‌లో తొలి కర్మాగారాన్ని ప్రారంభించిన మారుతీ.. మనేసర్‌లో మరో కర్మాగారాన్ని తర్వాత ప్రారంభించింది. రెండు ప్లాంట్ల ద్వారా ఏడాదికి 15 లక్షల యూనిట్లను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తోంది. భారత్‌ సహా 100 దేశాలకు తమ వాహనాలను ఎగుమతి చేస్తోంది. 40వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఏడాదే ఈ మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హిసాషి సంతోషం వ్యక్తంచేశారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మున్ముందూ ప్రయాణికుల వాహనాలకు వినియోగదారుల నుంచి ఇదే స్థాయిలో డిమాండ్‌ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని